Falooda Cake | పక్కా ఇండియన్ రెసిపీ ఇన్స్పిరేషన్తో ఫలూదా కేక్
Falooda Cake | ఫలూదా… హైదరాబాదీలు ఇష్టంగా తాగే వేసవి పానీయం. దీనిలో సేమియా, రోజ్ సిరప్, గుల్కంద్, రూహ్ ఆఫ్జా, సబ్జా గింజలు, డ్రైఫ్రూట్స్… ఇలా రకరకాల దినుసులు జోడిస్తారు. ఈ పక్కా ఇండియన్ రెసిపీ ఇన్స్పిరేషన్తో కేకులనూ తయారు చేశారు భారతదేశానికి చెందిన షబ్నమ్ రుసో ( Shabnam Russo ).
బ్రిటన్ రాణి ఎలిజబెత్ అధికార పీఠాన్ని అధిష్టించి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా నిర్వహించిన పుడ్డింగ్ పోటీల కోసం దీన్ని రూపొందించారామె. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 5వేల మంది పాల్గొన్నారు. అందులో తొలి అయిదు స్థానాల్లో ఒకటిగా నిలిచిందీ ఫలూదా! ‘సమాజంలో భిన్న వర్గాల ప్రజలున్నట్లే, ఫలూదాలోనూ ఎన్నో రుచులు ఉంటాయి. అందుకే బ్రిటన్ సంస్కృతిలోని విభిన్న కోణాల్ని చూపించడానికి నేను కేక్‌ను ఓ మాధ్యమంగా తీసుకున్నాను. చీజ్ క్రీమ్‌తో పాటు గులాబీ రేకులు, రంగు, ఎడిబుల్ పువ్వులు, ఆకులతో దీన్ని తయారుచేశాను. ఇందుకు వారం రోజులు పట్టింది’ అని చెబుతారు షబ్నమ్. అంటే, మన కేకు లండన్‌లో కేక పెట్టిందన్నమాట!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- cake
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

