ఒక కొత్త దేశానికి వెళ్లడం అంటే కేవలం భౌగోళికంగా మారడం మాత్రమే కాదు. అకడి జీవన విధానాన్ని, సంస్కృతిని మనస్ఫూర్తిగా అందుకోవడం. ఏ గైడ్ బుకులూ నేర్పించలేని.. కేవలం అనుభవంతోనే సొంతమయ్యే అలవాట్లు కొన్ని భారతదేశంలో అడుగుపెట్టిన ప్రతి ఒకరికీ ఎదురవుతుంటాయి. రష్యాకు చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అనస్తాసియా షరోవా విషయంలోనూ ఇదే జరిగింది. భారతదేశంలో స్థిరపడిన తర్వాత.. ఒకప్పుడు తనకు వింతగా అనిపించిన పలు విషయాలు ఇప్పుడు ఎలా దైనందిన జీవితంలో భాగమైపోయాయో ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నది.
భారతీయ వంటగదిలోకి అడుగుపెట్టిన ఏ విదేశీయునికైనా ప్రెషర్ కుకర్ ఒక పెద్ద అద్భుతం. తాను కూడా ఇందుకు మినహాయింపు కాదంటున్నది అనస్తాసియా. ‘శనగలు ఉడకడానికి ఎన్ని విజిల్స్ రావాలి? బంగాళాదుంపలకైతే ఎన్ని కావాలి? అనే లెకలను గందరగోళం లేకుండా గుర్తుపెట్టుకోవడం ఇకడ వంటలో అత్యంత కీలకం’ అని ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఇక్కడి రోడ్లపై డ్రైవింగ్ అనుభవం గురించి చెబుతూ..‘ఇకడి ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయాలంటే ఒకే సమయంలో నాలుగు దికులా నిశితంగా గమనించడం అలవాటు కావాలి’ అంటూ రోడ్లపై ఉండే సవాళ్లను సరదాగా ప్రస్తావించింది. భారతదేశ సంస్కృతిలో భాగమైన కొన్ని అర్థవంతమైన పద్ధతులు ఆమెను అమితంగా ఆకర్షించాయి. ఇరుగుపొరుగు వారు జరుపుకొనే పండుగ ఏ గిరి గీసినదైనా, కుల మతాలతో సంబంధం లేకుండా వారికి మిఠాయిలు అందిస్తూ ఆనందాన్ని పంచుకోవడం ఆమెకు ఎంతో నచ్చినట్లు వివరించింది. దుస్తుల రంగులు వెలిసిపోకుండా ఉండటానికి వాటిని నేరుగా ఎండ తగలకుండా ఆరబెట్టడం, గ్రామీణ ప్రాంతాల్లో కీటకాలు రాకుండా సాంబ్రాణి ధూపం వేయడం వంటి దేశీయ చిటాలను ఆమె అలవర్చుకున్నట్లు గుర్తు చేసుకున్నది. ఇకడి సందు గొందుల్లో దారి తప్పినప్పుడు టెక్నాలజీ కంటే స్థానిక ప్రజలు ఇచ్చే రూట్ గైడెన్స్ ఎంతో నమ్మదగినదని ఆమె అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చింది. భాషల కలయిక ఇకడ సర్వసాధారణం. ఒకే సంభాషణలో బహుళ భాషలను అలవోకగా మార్చేస్తూ మాట్లాడటం ఆమెకు ఇప్పుడు అలవాటైపోయింది. ఇంటికి వచ్చే అతిథి ఎవరైనా సరే, అడగకముందే ఒక గ్లాసు మంచినీళ్లు ఆఫర్ చేయడం ఇప్పుడు తనకు ఒక సహజ స్వభావంగా మారినట్లు తెలిపింది.
మన మనసు గెలిచింది
అనస్తాసియా పంచుకున్న ఈ అనుభవాలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీశాయి. వేలాది మంది భారతీయులు ఆమె పరిశీలనలతో ఏకీభవిస్తూ, తమ దైనందిన జీవితంలోని మరికొన్ని ముచ్చట్లను కామెంట్ల రూపంలో జోడించారు. ‘కొన్ని పాశ్చాత్య దేశాలలో మంచినీళ్లకు కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. కానీ, భారతదేశంలో ఇంటికి వచ్చే ఎవరికైనా కనీసం సాధారణ నీళ్లయినా ఇవ్వడం అనేది ఒక ప్రాథమిక బాధ్యత, సంసృతి’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, చదువుకునే పుస్తకాలకు పొరపాటున కాలు తగిలితే దానికి నమసరించుకునే కృతజ్ఞతా భావాన్ని, పెద్దల పాద నమసారాలను గుర్తుచేస్తూ భారతదేశ వైవిధ్యాన్ని మరికొందరు కొనియాడారు. మొత్తానికి రష్యా నుంచి వచ్చిన ఈ కంటెంట్ క్రియేటర్ భారత దేశంలో మాత్రమే కనిపించే ఈ చిన్న చిన్న అలవాట్లలోని అందాన్ని గుర్తిస్తూ… ‘ఇది కదా అసలైన ఇండియా!’ అని నిరూపించింది.