ఇల్లాలి త్యాగాలకు ప్రతీక ‘రిమి’!

ఉదయం లేచిన దగ్గర్నుంచీ ఏ అర్ధరాత్రో పడుకునే వరకూ ఓ ఇల్లాలు ఎన్ని త్యాగాలు చేస్తుందో, ఎంత ప్రేమను పంచుతుందో, తనను తాను ఎంతగా కోల్పోతుందో లెక్కగట్టారా? మీ సమాధానం ‘లేదు’ అయితే.. 13 నిమిషాల నిడివిగల ‘రిమి’ షార్ట్‌ఫిల్మ్ చూడండి. ప్రతి గృహలక్ష్మి కథ ఇది. నిస్వార్థంగా కుటుంబానికి ఎంతో సేవ చేస్తారు మహిళలు. భార్యగా, కోడలిగా, తల్లిగా ఆమె కష్టాన్ని లఘు చిత్రంలో కండ్లకు కట్టారు డైరెక్టర్ నిశ్చల్ శర్మ. ఈ షార్ట్ ఫిల్మ్ ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కొల్లగొడుతున్నది. లాక్డౌన్ సమయంలో ఇంట్లో తన తల్లి త్యాగాలను అతి దగ్గర నుంచీ చూసి, స్ఫూర్తి పొందాడట దర్శకుడు కమ్ రచయిత నిశ్చల్. లండన్‌లోని మెట్ ఫిల్మ్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన 22 యేండ్ల నిశ్చల్, మానవ సంబంధాలను ప్రతిబింబించే అనేక షార్ట్‌ఫిల్మ్స్ రూపొందించాడు. ఈ షార్ట్‌ఫిల్మ్ ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ నటుడు, ఉత్తమ సౌండ్ డిజైన్ వంటి అనేక విభాగాల్లో ఎన్నో అవార్డులు గెలుచుకుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

