పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
నాకు ఇద్దరు కొడుకులు. పెద్దోడికి పదమూడేండ్లు, చిన్నోడికి ఎనిమిదేండ్లు. స్కూల్‌కు వెళ్లేటప్పుడు చెప్పిన మాట వినేవారు. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండేసరికి మొండిగా తయారయ్యారు. ఏం చేస్తే మార్పు వస్తుంది? ఈ వయసు పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి?
లక్ష్మి, కొండాపూర్

జ: పిల్లల విషయంలో అమ్మానాన్నలకు నాలుగు మార్గాలుంటాయి. పాజిటివ్ స్పందన, నెగెటివ్ స్పందన, శిక్ష, ఉదాసీనత. ఉదాహరణకు, పిల్లలు చకచకా హోమ్‌వర్క్ చేసినప్పుడు వాళ్లకు చాక్లెట్ ఇవ్వడమో లేదా ఆడుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించడమో చేయాలి. అలాగే, ఎంతకీ హోమ్‌వర్క్ పూర్తి కాకపోతే మరింత గడువు ఇచ్చి ప్రోత్సహించాలి. ఏదైనా తప్పు చేసినా, సున్నితంగా‘ఫలానా పని తప్పు’ అని చెప్పొచ్చు లేదంటే వాళ్ల తప్పు వాళ్లే తెలుసుకునేలా చేయవచ్చు. ఎంత చెప్పినా చేయాల్సిన పని చేయకపోతే, చేసేదాకా వెంటపడవచ్చు. దీన్నే ‘నెగెటివ్ రెస్పాన్స్’ అంటారు. పిల్లల్ని శిక్షించడానికి.. తిట్టడం, కొట్టడం అనే మూడోదారినే ఎంచుకుంటారు కొందరు.
అలాకాకుండా ఒక రోజంతా వాళ్లకు ఇష్టమైన బొమ్మలను దూరంగా ఉంచవచ్చు. టీవీ వంటి వినోద సాధనాలను దూరం చేయవచ్చు. ఇలాంటి పరోక్ష శిక్షలు కూడా ఫలితం ఇస్తాయి. అయితే, కొందరు అమ్మానాన్నలు మాట వినటం లేదన్న కారణంగా.. పిల్లల చర్యల పట్ల ఉదాసీనంగా ఉంటారు. వాళ్లేం చేసినా పట్టించుకోరు. దీనివల్ల, బిడ్డలు మరింత మొండిగా తయారవుతారు. కాబట్టి, ఈ నాలుగు దారుల్లోనూ.. పాజిటివ్‌గా ప్రవర్తించడమే అన్నిటికన్నా ఉత్తమం. వాళ్లు చేసే చిన్నపాటి మంచిపనినైనా మెచ్చుకోవాలి. దీనివల్ల క్రమశిక్షణ, బాధ్యత అలవాటవుతాయి.
సహానా రబీంద్రనాథ్
లైఫ్ కోచ్ అండ్ థెరపిస్ట్ SWITCH NOV
హైదరాబాద్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Encouragement
- praise
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

