పిస్తా బాదం బర్ఫీ
బాదం పప్పును గంటపాటు వేడినీళ్లలో నానబెట్టి పొట్టుతీసి ఆరబెట్టాలి. మిక్సీ జార్లో బాదం పప్పు, పిస్తా మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి చక్కెర, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుతూ తీగపాకం వచ్చాక బాదం మిశ్రమం జోడించి కలపాలి
కావలసిన పదార్థాలు
బాదం పప్పు: అర కప్పు, పిస్తా పప్పు: పావు కప్పు, చక్కెర: అర కప్పు, పాలపొడి: పావు కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ (గ్రీన్): రెండు చుక్కలు.
తయారీ విధానం
బాదం పప్పును గంటపాటు వేడినీళ్లలో నానబెట్టి పొట్టుతీసి ఆరబెట్టాలి. మిక్సీ జార్లో బాదం పప్పు, పిస్తా మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి చక్కెర, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుతూ తీగపాకం వచ్చాక బాదం మిశ్రమం జోడించి కలపాలి. మిశ్రమం దగ్గర పడుతుండగా పాలపొడి, యాల కుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి.. దగ్గర పడ్డాక దించేయాలి. ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి మిశ్రమాన్ని సమంగా పరిచి పైనుంచి బాదం, పిస్తా ముక్కల్ని చల్లాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకుంటే నోరూరించే పిస్తా బాదం బర్ఫీ సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

