‘తినేది మంచిదా? కాదా?’ సందేహం నివృత్తి చేసుకోవడం ఎవరికైనా అవసరం. ప్యాక్‌పై రాసిన అందమైన రాతలు కాదు దానిలో ఆహార నాణ్యత, శుభ్రత ఎంతో తెలుసుకోవాలి. ‘సేంద్రియ సాగు, రసాయనాలు లేవు’ అని ప్యాక్ మీద రాసినంత మాత్రాన నిజం కాదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గుర్తింపు ఉందో లేదో పరిశీలించాలి. కంపెనీల్లో తయారయ్యే తిండి సంగతి సరే, మీ ఇంటిలో తయారయ్యే సంగతేంటి? స్కూల్, ఆఫీస్, పని చేసే ప్రదేశాల్లో తినడం కోసం లంచ్ బాక్స్ తీసుకుపోతారు.
అది శుభ్రంగా ఉందని, ఆహారం పాడవకుండా ఉంటుందని ఏమిటి గ్యారెంటీ? దీనిని ఎందుకు పట్టించుకోరని ప్రశ్నిస్తోంది ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ. కొనేదైనా, తయారు చేసుకునేదైనా ప్రమాణాలు అన్నిటికీ వర్తిస్తాయని గుర్తు చేస్తున్నది. లంచ్ బాక్స్‌లో ఉండే ఆహార నాణ్యత మారకుండా ఎలాంటి లంచ్ బాక్స్‌ని ఉపయోగించాలి. శుభ్రతను ఎలా పాటించాలో చెబుతూ ఎఫ్ఎస్ఎస్ఏఐ కొన్ని సూచనలు చేసింది. అవేమిటంటే…