అంతర్జాతీయ వేదికపై.. హైదరాబాదీ సుధారెడ్డి
నినాదంతో ఏర్పాటైన సంస్థ ఫ్యాషన్ ఫర్ డెవలప్మెంట్. పదో వార్షికోత్సవాల్లో భాగంగా ఆ సంస్థ.. చరిత్రలోనే తొలిసారిగా ఒక భారతీయ మహిళను న్యూయార్క్లో జరుగుతున్న వేడుకలకు ఆహ్వానించింది.
- సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ..
నినాదంతో ఏర్పాటైన సంస్థ ఫ్యాషన్ ఫర్ డెవలప్మెంట్. పదో వార్షికోత్సవాల్లో భాగంగా ఆ సంస్థ.. చరిత్రలోనే తొలిసారిగా ఒక భారతీయ మహిళను న్యూయార్క్లో జరుగుతున్న వేడుకలకు ఆహ్వానించింది. హైదరాబాద్కు చెందిన సుధారెడ్డి ఆ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. పారిశ్రామికవేత్త మేఘ కృష్ణారెడ్డి జీవిత భాగస్వామిగా కూడా సుధారెడ్డి ప్రసిద్ధురాలే. తొలి నుంచీ ఆమె యాక్షన్ ఎగైనెస్ట్ హంగర్, బ్రెస్ట్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ తదితర దాతృత్వ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.
ఆకలితో పిల్లలు చనిపోవడం అన్నది తనను కలచివేసిందనీ, ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధ పడుతున్నవారిలో 40 శాతం మంది మన దగ్గరే ఉండటం బాధాకరమనీ ఆవేదనతో చెబుతారామె. తనదైన ఫౌండేషన్ ద్వారా నేషనల్ హెల్త్ మిషన్తో కలిసి పనిచేస్తున్నారు సుధారెడ్డి. తను ఫ్యాషన్ పండితురాలు కూడా. సస్టెయినబుల్ ఫ్యాషన్ (ఫ్యాషన్ ద్వారా ప్రపంచ సుస్థిరాభివృద్ధి) నినాదంతో వివిధ కార్యక్రమాలు చేపట్టారు.

గత ఏడాది న్యూయార్క్లో జరిగిన ప్రఖ్యాత ఫ్యాషన్ ఈవెంట్కూ హాజరయ్యారు. ఫ్యాషన్ ఫర్ డెవలప్మెంట్ సంస్థ త్వరలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచీ వినోద, ఫ్యాషన్, రాజకీయ, వ్యాపార.. రంగాలకు చెందిన సుప్రసిద్ధ వ్యక్తులు రానున్నారు. సమాజం కోసం పనిచేస్తున్న వారికి ఈ వేదికపై ‘ఏజెంట్స్ ఆఫ్ ఛేంజ్’ అవార్డును బహూకరించనున్నారు. అంతేకాదు, ప్రపంచ సుస్థిర అభివృద్ధికి భారతదేశం ఎలా దోహదం చేయగలదు అనే అంశం మీద సుధారెడ్డి ప్రసంగించనున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

