కాలం చెల్లిన ఫ్యాషన్లకు మళ్లీ స్వాగతం పలకడం ఎప్పుడూ ఉన్నదే. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో తారలు ధరించిన హ్యాండ్ గ్ల్లోవ్స్.. తాజాగా ట్రెండింగ్లోకి వచ్చాయి. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ మీదుగా టాలీవుడ్లోనూ హ్యాండ్గ్లోవ్స్ ముస్తాబు మొదలైంది.
మ్యాచింగ్ తొడుగులతో చలి నుంచి వెచ్చని రక్షణ కూడా లభిస్తుంది. పోల్కా డాట్స్ నుంచి చికంకారీ అలంకారాల దాకా ఎన్నో కొత్త అందాలను పరిచయం చేస్తున్నారు గ్లోవ్ డిజైనర్స్. కియారా మొదలు ఆలియా వరకు.. వీటి అభిమాన సంఘం పెద్దదే.