కాత్యాయనీ దేవి
ఈసారి నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మ అనుగ్రహించే రూపం కాత్యాయని. చతుర్భుజాలతో, వరద, అభయ హస్తాలతో, ఖడ్గం, పద్మం ధరించి సింహ వాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది అమ్మవారు. బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్యతేజస్సుతో అలరారుతుంటుంది. కతు మహర్షి తపస్సంపన్నుడు. అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తాడు.
ఈసారి నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మ అనుగ్రహించే రూపం కాత్యాయని. చతుర్భుజాలతో, వరద, అభయ హస్తాలతో, ఖడ్గం, పద్మం ధరించి సింహ వాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది అమ్మవారు. బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్యతేజస్సుతో అలరారుతుంటుంది. కతు మహర్షి తపస్సంపన్నుడు. అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తాడు. ఆమె కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. కతుని దీక్షకు మెచ్చి దర్శనమిస్తుంది పరాశక్తి. ‘ఏం వరం కావాలి?’ అని అడుగుతుంది. అమ్మవారి అనుగ్రహం తప్ప మరే కోరికా లేని కతుడు… ‘నీవు నా ఇంట జన్మించి.. మా వంశాన్ని పునీతం చేయమ’ని కోరుకుంటాడు. కొన్నాళ్లకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దివ్య తేజస్సుతో కతుని ఇంట ఆవిర్భవించింది అమ్మవారు. కాత్యాయనిగా లోకప్రసిద్ధి పొందింది. కాత్యాయని అంటే తేజ స్వరూపిణి, మహాతేజో పుంజం అని అర్థాలు. తేజస్సు అంటే జ్ఞానం. అమ్మవారు జ్ఞానదాయిని. కాత్యాయని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. భక్తులను భవజలధి, చింతా జలధి, సంసార జలధి అనే భవసాగరాల నుంచి ఉద్ధరింపజేస్తుంది. ధర్మార్థకామమోక్షాలకు అధికారిణి ఈమె.
‘పార్వతీదేవే కాత్యాయని’ అని అమరకోశం చెబుతున్నది. పతంజలి మహర్షి ‘దుర్గాదేవే.. కాత్యాయని’ అని అభివర్ణించాడు. శాక్తేయంలో కాత్యాయనీ దేవిని దుర్గ, భద్రకాళి, చండికల అపర అవతారంగా పరిగణిస్తారు. మహిషాసుర సంహారంలో దుర్గాదేవికి కాత్యాయని సింహ వాహనం అధిష్ఠించి సాయం చేసిందని స్కాంద పురాణం చెబుతున్నది. మార్కండేయ పురాణం, దేవీ భాగవతం కాత్యాయని ప్రాశస్త్యం గురించి ప్రస్తావించాయి. బౌద్ధ, జైన వాఙ్మయంలోనూ అమ్మవారి విశేషాలు కనిపిస్తాయి. యోగశాస్త్రం ప్రకారం కాత్యాయని ఆజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవతగా చెబుతారు. ఆజ్ఞా చక్రాన్ని జాగృతపరచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అమ్మవారు. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నంద గోప సుతం దేవిం పతియే కురుతే నమః॥ అని ధ్యానిస్తూ కాత్యాయనీ దేవిని ఉపాసిస్తారు. ఆ తల్లి అనుగ్రహంతోనే గోపికలంతా శ్రీకృష్ణుడి అనురాగం పొందారని భాగవతం పేర్కొన్నది. కాత్యాయని ఆరాధన వల్ల ఉత్తమ సంతానం, కుటుంబవృద్ధి, సౌభాగ్యం, సంపదలు కలుగుతాయి.
శ్రీ భారతి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

