కొన్నిసార్లు అలంకరణ అతివకు కొత్త అందాన్ని తెస్తే, కొన్నిసార్లు నిరలంకరణలోనే నిర్మల సౌందర్యం కనిపిస్తుంది. పాలలోనూ, నీళ్లలోనూ వెలుగులీనే చందమామలా ఎలాంటి లుక్లోఅయినా ముచ్చటగా దర్శనమిస్తుంది మలయాళ ముద్దుగుమ్మ మాళవికా నాయర్.
ఆకుపచ్చ ఆకులు, నారింజ రంగు పూల కలయికగా వచ్చిన ఇటుకరాయి రంగు ఫ్లేర్డ్ మ్యాక్సీలో ఆమె మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. దీనికి తోడు చెవులకు వెండి రంగు రింగులు. లైట్ మేకప్, రఫ్ హెయిర్‌తో చూడగానే సింప్లీ సూపర్బ్ అనేలా ఉందీ ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ కథానాయిక.