నగేశ్ ప్రకృతి పాఠాలు

‘ప్రకృతిని మనం కాపాడితేనే.. ప్రకృతీ మనల్ని కాపాడుతుంది’ ..అంటూ విద్యార్థులకు పర్యావరణ పాఠాలు చెప్పడమే కాదు.. తానూ స్వయంగా ఆ సూత్రాన్ని ఆచరిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్నాడో ఉపాధ్యాయుడు. ప్రకృతిపై ప్రేమతో తన ఇంటినే సుందరవనంలా తీర్చిదిద్దారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రానికి చెందిన కనకం నగేశ్, 2019లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. నగేశ్‌కు మొక్కలంటే అమితమైన ప్రేమ. దేశం నలుమూలల నుంచీ అరుదైన మొక్కలను సేకరిస్తుంటారు. ఇతర దేశాల నుంచీ ఆన్లైన్లో కొనుగోలు చేస్తుంటారు. వీటిని తన ఇంటి ఆవరణలోనే సంరక్షిస్తున్నారు. టెర్రస్‌పైన మొక్కల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి, పూర్తి స్థలాన్ని వినియోగంలోకి తీసుకొచ్చారు. పండ్ల మొక్కల పెంపకం కోసం ఆర్గానిక్ పద్ధతిని ఎంచుకొన్నారు. మొక్కలను ఆశించే పురుగులను నిర్మూలించేందుకు పిచ్చుకలను పెంచుతున్నారు. వీటికోసం ఇంటి వసారాలోనే ప్రత్యేకంగా గూళ్లు ఏర్పాటు చేశారు. ‘విలువల పాఠాలు చెప్పే నేను, మరో పదిమందికి ఆదర్శంగా ఉండాలన్నదే నా ఉద్దేశం. మొక్కలకోసం అంతర్జాతీయ నర్సరీ మేళాలకు హాజరవుతా. మా ఇంట్లో ఏడాది పొడవునా ఏదో ఒకరకం పండు అందుబాటులో ఉంటుంది. ఇంటికి వచ్చిన అతిథులు, బంధువులు, స్నేహితులకు కొత్త రకం మొక్కను బహుమతిగా ఇస్తుంటా’ అని చెబుతున్నారు నగేశ్.
… పల్లేటి నాగార్జున
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

