మహిళలు వ్యాపార రంగంలో ఏ స్థాయిలో దూసుకెళ్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెప్సికో మాజీ సీయీవో ఇంద్రా నూయి ప్రస్తుతం అమెజాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నది. ఆమె తన జీవితానుభవాలపై రాసిన పుస్తకం ‘మై లైఫ్ ఇన్ ఫుల్ : వర్క్, ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్’ ఈమధ్యే విడుదలైంది. ‘పిల్లలకు, ముఖ్యంగా కూతుళ్లకు తల్లి అవసరం చాలా ఉంటుంది. వంద వ్యాపకాలతో సతమతమవుతున్నా సరే, ఆమె ఎప్పుడూ బిడ్డలను కనిపెట్టుకుని ఉండాలి. గుండె లోపల ఎంత భారం ఉన్నా, పిల్లల ముందు నవ్వుతూ కనిపించాలి. ఇటు వృత్తిని, అటు కుటుంబాన్ని సమన్వయం చేసుకున్నప్పుడే తాను సాధించిన విజయాలు ఆమెకు పరిపూర్ణ తృప్తినిస్తాయి. నా పుస్తక సారాంశం కూడా ఇదే’ అంటుందామె.