అమ్మా.. జాగ్రత్త!

అమ్మ అనిపించుకోవడం ఓ వరం. అయితే, తల్లి కావడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే మహిళలు.. ప్రసవం తర్వాత మాత్రం తమ ఆరోగ్యాన్ని అసలు పట్టించుకోరు. చిన్నారి పెంపకంపైనే శ్రద్ధ చూపుతూ.. తమ గురించి మరిచిపోతారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, ప్రసవానంతరం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి..
- గర్భవతిగా ఉన్నప్పటికంటే కాన్పు తర్వాతే ఎక్కువ బలమైన ఆహారం తీసుకోవాలి. అన్ని రకాల కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, మాంసాహారం, పాలు, పండ్లు తీసుకోవాలి. నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది. దీనివల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్స్, మలబద్ధకం వంటివాటిని నివారించవచ్చు. కారం, పచ్చళ్లు, మసాలాలు తినకూడదు.
- ఐరన్, క్యాల్షియం మాత్రలను డెలివరీ తర్వాత కూడా మరో మూడు నెలలపాటు తప్పని
- సరిగా వాడాలి. అప్పుడే, రక్తహీనత ఏర్పడకుండా ఉంటుంది.
- తల్లికి మానసిక ప్రశాంతత అవసరం. కాన్పు తరువాత కలిగే అలసట విశ్రాంతితో తగ్గుతుంది. పాలు కూడా బాగా పడతాయి.
- కాన్పు తర్వాత కొందరు మహిళలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి ఇబ్బంది పెడతాయి. యూరిన్ బ్లాడర్‌లో వాపుకూడా వస్తుంది. డెలివరీ సమయంలో వెజినల్ డ్యామేజ్ దీనికి కారణం కావచ్చు. ఇటువంటి సమస్యలు ఎదురైతే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
- సాధారణ కాన్పు జరిగిన నెల తర్వాత వ్యాయామాలు మొదలు పెట్టవచ్చు. ఒకవేళ ఆపరేషన్ అయితే తల్లి ఆరోగ్య పరిస్థితినిబట్టి 2-3 నెలల తర్వాత వ్యాయామాలు చేయడం మంచిది. వ్యాయామం వల్ల పొట్ట పెల్విక్ కండరాలు దృఢమవుతాయి. నడుమునొప్పి తగ్గుతుంది.
ఇవీ కూడా చదవండి
సాగర్ ఉపఎన్నికలో నా ఓటు నోముల భగత్‌కే : రాం గోపాల్ వర్మ
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్: కొత్త ఐటీఆర్ ఫారాల్లో మార్పుల్లేవ్
ఆడపిల్ల పుట్టిందని సంకేతమిస్తూ.. నీటిలో కూలిన విమానం
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

