క్యాన్సర్ కారకాలుగా మారుతున్న మానవ తప్పిదాలు
క్యాన్సర్ వ్యాధులకు కచ్చితమైన కారణాలు లేనప్పటికీ, కొన్ని మానవ తప్పిదాలు, వాతావరణ పరిస్థితులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి. కారకాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, వృత్తి, వాతావరణ కాలుష్యం, ఇన్ఫెక్షన్లు, అధిక బరువు, అధిక మోతాదులో హార్మోన్లకు సంబంధించిన మందులు వాడటం
క్యాన్సర్ వ్యాధులకు కచ్చితమైన కారణాలు లేనప్పటికీ, కొన్ని మానవ తప్పిదాలు, వాతావరణ పరిస్థితులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి. కారకాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, వృత్తి, వాతావరణ కాలుష్యం, ఇన్ఫెక్షన్లు, అధిక బరువు, అధిక మోతాదులో హార్మోన్లకు సంబంధించిన మందులు వాడటం, వయస్సు పెరగడం వంటివి క్యాన్సర్‌కు దారితీసే అంశాలుగా చెప్పవచ్చు. సాధారణంగా వయస్సు పెరుగుతున్న కొద్ద్దీ క్యాన్సర్లకు దగ్గరవడం జరుగుతుంది. అయితే ఇది అందరిలో జరగకపోయినా, చాలా మందిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. వృద్ధాప్యంలో వచ్చే క్యాన్సర్లు నెమ్మదిగా విస్తరిస్తాయి. యుక్త వయస్సులో వచ్చే క్యాన్సర్లు వేగంగా విస్తరిస్తాయి. అందువల్ల చికిత్స అనేది రోగి వయస్సుపై ఆధారపడి ఉంటుంది.
డీఎన్ఎ మ్యుటేషన్ వల్ల:
మనుషులే కాదు జంతువులు, మొక్కలు.. జీవం ఉన్న ఏ కణజాలమైనా క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలుఉన్నాయి. జీవకణంలోని డీఎన్ఏ మ్యుటేషన్ చెంది, అపరిమితంగా పెరిగిపోవడాన్నే క్యాన్సర్‌గా పరిగణిస్తారు. దీనికి కొన్ని సందర్భాలలో జెనిటిక్స్ సైతం దోహదపడతాయి. బాహ్య పరిస్థితుల వల్ల కూడా వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కొన్నిరకాల వృత్తుల వారు ఎక్కువగా క్యాన్సర్ బారిన
పడుతుంటారు.
వీరికి రిస్క్ ఎక్కువ:
ప్రధానంగా ఆస్బెస్టాస్ కంపెనీలలో పనిచేసే వారు, అల్యూమినియం ఉత్పత్తుల కంపెనీలు, ఆల్కహాలిక్ బేవరేజస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీల్లో పనిచేసేవారు, రేడియం ఉత్పత్తులు, రేడియో న్యూక్లయిడ్స్, చెక్కపొడి, గామా రేడియేషన్ అధికంగా ఉండే ప్రాంతాలలో పనిచేసే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అధికంగా ఎండలో తిరిగేవారు, ఎండ అస్సలు తగల కుండా ఏసీ గదులకే పరిమితమయ్యేవారు, అధికంగా నైట్ డ్యూటీలు చేసేవారు, పెస్టిసైడ్స్, కెమికల్స్ మధ్య ఎక్కువగా పనిచేసే వారికి మెలిటోనిస్ ఉత్పత్తి తగ్గటం వలన రోగ నిరోధక శక్తి తగ్గి, క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ వైరస్ల వల్ల: హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్ఐవీ)లోని కొన్ని రకాలు, హెలికోబాక్టర్ పైలోరి(హెచ్-పైలోరి), హెపటైటిస్ బి, సీ వైరస్లు, హెచ్ఐవీ వైరస్, ఎప్స్టి యన్ బార్ వైరస్ వంటి వాటికి గురై తరచూ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకనే వీటిని అంకో వైరస్‌లుగా పిలుస్తారు. హెచ్ఐవీ వైరస్ వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, హెచ్-పైలోరి వల్ల జీర్ణాశయ సంబంధిత అల్సర్స్ క్యాన్సర్స్‌గా మారటం, హెపటైటిస్-బి, హెపటైటిస్-సి వల్ల లివర్ క్యాన్సర్స్, ఈబీవీ వైరస్ వల్ల లింఫోమాకు సంబంధించిన క్యాన్సర్స్, హెచ్ఐవీ వైరస్ వల్ల శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ కణుతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
ఆ వైరస్లు రాకుండా టీకాలు: క్యాన్సర్లకు కారణమయ్యే హెచ్ఐవీ, హెచ్ఈపీ-బి వైరస్లు రాకుండా ముందస్తు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వైరస్లు రాకుండా అడ్డుకోగలిగితే సంబంధిత క్యాన్సర్లను కూడా నిరోధించవచ్చు. వైవాహిక జీవితానికి ముందే 3 డోసులు ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ క్యాన్సర్ వ్యాధినైనా ప్రారంభ దశలో గుర్తిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. రోగి జీవిత కాలాన్ని పెంచవచ్చు.
నిర్ధారణ పరీక్షలు:
- పిఎస్ఏ
- డిఆర్ఏ
- సీటీ-స్కాన్
- ఎంఆర్ఐ
- అల్ట్రాసౌండ్
- బోన్ స్కాన్
పాటించాల్సిన జాగ్రత్తలు:
- పళ్లు, కూరగాయలను ఉప్పునీళ్లతో కడిగిన తరువాతనే వాడాలి.
- 30 దాటిన మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, పాప్‌స్మియర్ చెకప్ వంటివి చేయించుకోవాలి.
- 50 ఏళ్లు దాటిన పురుషులు పీఎస్ఏ పరీక్ష చేయించుకోవాలి.
- ధూమపానం, మధ్యపానం, పొగాకు ఉత్పత్తులు వంటి వాటికి దూరంగా ఉండాలి.
– డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98490 22121
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

