ఆమె చుట్టూ పాజిటివ్ ఆరా
బాలీవుడ్ సెన్సేషన్ కృతి సనన్ ఇప్పుడు తన తదుపరి చిత్రం కాక్ టెయిల్ 2 ప్రమోషన్లలో బిజీగా ఉంది. షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి ఆమె నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఫెమినా బ్యూటీ అవార్డ్స్ వేదికగా కృతి తన కో-స్టార్ రష్మిక గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ సెన్సేషన్ కృతి సనన్ ఇప్పుడు తన తదుపరి చిత్రం కాక్ టెయిల్ 2 ప్రమోషన్లలో బిజీగా ఉంది. షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి ఆమె నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఫెమినా బ్యూటీ అవార్డ్స్ వేదికగా కృతి తన కో-స్టార్ రష్మిక గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేషనల్ క్రష్ రష్మికతో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవమని కృతి కొనియాడింది. సెట్స్‌లో తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ..‘రష్మిక చాలా నిజాయతీ కలిగిన వ్యక్తి. తను చాలా ప్రేమగా, ఆత్మీయంగా ఉంటుంది. ముఖ్యంగా తనలో ఎలాంటి అసూయ ఉండదు. కేవలం మంచితనం మాత్రమే కనిపిస్తుంది. నేను వైబ్స్‌ని నమ్ముతాను, తన చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. తనతో కలిసి షూటింగ్లో పాల్గొనడం చాలా సరదాగా గడిచింది’ అంటూ కృతి పేర్కొన్నది.
రష్మిక వ్యక్తిగత జీవితం గురించి కూడా కృతి ఈ సందర్భంగా మాట్లాడింది. హైదరాబాద్‌లో నిర్వహించిన విజయ్-రష్మిక రిసెప్షన్‌కు హాజరైన కృతి.. ఆ జంటకు తన శుభాకాంక్షలు తెలియజేసింది. దర్శకుడు హోమి అడజానియా కూడా అప్పట్లో ఇన్‌స్టా స్టోరీస్‌లో సరదాగా కృతిని ఆటపట్టించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకుంది. కాగా 2012లో వచ్చిన సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనే, డయానా పెంటీల కాక్ టెయిల్ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ‘ఇది సీక్వెల్ కాదు.. ఒక ఫ్రాంచైజీ సినిమా మాత్రమే. ఇందులోని పాత్రలు, కథ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇది నేటి తరం రిలేషన్షిప్స్కు అద్దం పడుతుంది’ అని కాక్ టెయిల్ 2 గురించి చెప్పుకొచ్చింది కృతి. ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలోని ‘జబ్ తలక్’ అనే మొదటి పాట ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

