హైదరాబాద్ నా రెండో ఇల్లు!
ఎవరి జీవితం ఎప్పుడు, ఏ మలుపు తీసుకుంటుందో ఎవరికీ తెలీదు. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలలుగన్న ఆ యువకుడు అనుకోని పరిస్థితుల్లో వెనక్కి రావాల్సి వచ్చింది. కాబట్టే, జీవితంలోని కీలక మలుపు దగ్గర నిర్ణయాధికారాన్ని ఇంకొకరి చేతుల్లో పెట్టవద్దనీ, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలనీ అంటున్నారు జీ తెలుగు ‘కృష్ణ తులసి’ హీరో దిలీప్ శెట్టి.

చిన్నప్పటినుంచీ నాకు జీవితం పట్ల స్పష్టత ఉంది. చదువుమీద ప్రేమ ఎక్కువ. మంచి ఉద్యోగంలో స్థిరపడాలనేది నా కోరిక. అందుకే, కామర్స్‌లో మాస్టర్స్ చేసి, దుబాయ్‌లోని ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా చేరాను. చదువుతోపాటే సాంస్కృతిక కార్యక్రమాలన్నా ఇష్టమే. కాలేజీ రోజుల్లో బాగా డ్యాన్స్ చేసేవాణ్ణి. దుబాయ్ వెళ్ళాక ఆ అభిరుచిని వదలలేదు. మోడలింగ్కూడా చేశాను. 2015లో ‘మిస్టర్ దుబాయ్’ సెకండ్ రన్నరప్‌గా నిలిచాను. అంతా సాఫీగా సాగిపోతున్న దశలో అనుకోని ఘటన. ‘నాన్నగారికి ఒంట్లో బాగా లేదని’ ఫోన్ వచ్చింది. వెంటనే మంగళూరు వచ్చేశా. అప్పుడే ఓ మెసేజ్, ‘ఓ సీరియల్లో అవకాశం ఉంది చేస్తారా? అని. ఇక, ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకొన్నా. అలా, జీ కన్నడ చానల్లో ‘విద్య వినాయక’ సీరియల్లో నటించా.
తెలుగులోకి ప్రవేశం
కన్నడ సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలోనే ‘రాబర్ట్’ మూవీలో జగపతి బాబుగారి కొడుకు పాత్ర వెతుక్కుంటూ వచ్చింది. అప్పుడే, ఈ టీవీ ‘స్వర్ణ ఖడ్గం’ సీరియల్లో అవకాశం వచ్చింది. ‘అర్కా మీడియా వర్క్స్’ వంటి పెద్ద బ్యానర్లో మొదటి అవకాశమంటే మాటలు కాదు. ఇప్పుడు జీ తెలుగు ‘కృష్ణ తులసి’కూడా పెద్ద ప్రాజెక్టే. రాఘవేంద్రరావు గారి నిర్మాణంలో వస్తున్న ఈ సీరియల్లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రస్తుతం కొన్ని ఆల్బమ్స్, మూవీస్‌లో అవకాశాలున్నాయి. ఇంకా ఫైనల్ చేయలేదు. భవిష్యత్తులో ఓ మంచి హీరోగా ఎదగాలనే ఆశయంతో పని చేస్తున్నా.
ఆయనే నా గురువు
నా నటనను, శరీరాకృతిని చాలామంది మెచ్చుకుంటారు. ముఖ్యంగా కన్నడలో ప్రముఖనటుడు దర్శన్‌గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ను నేనెప్పటికీ మరచిపోలేను. కన్నడలో సీరియల్ దర్శకుడు ముసంజ ముత్తయ్ సర్ నాకు గురువు లాంటివారు. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. సుదీప్వంటి పెద్ద హీరోలను డైరెక్ట్ చేశారాయన.

అనుకున్నది సాధించాలి
జీవితంలో కొన్నిసార్లు ఏదో ఒకటి తేల్చుకునే పరిస్థితులు వస్తాయి. నా జీవితంలోనూ అంతే. నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు దుబాయ్‌లో జాబ్ వదిలేసి మంగళూరు వచ్చేయాలా, వద్దా అనే సందిగ్ధం ఏర్పడింది. నాన్నను అడిగితే ‘నీకు నచ్చింది చెయ్యి’ అన్నారు. బాగా ఆలోచించి వచ్చేశా. ఏ పరిస్థితుల్లో అయినా మనకు నచ్చిందే చేయాలి. ఇంకొకరికి నిర్ణయాధికారం ఇవ్వకూడదు. కష్టమైనా, నష్టమైనా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండాలనేది నా అభిమతం.
కుటుంబ నేపథ్యం
నాకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య. అందరికీ పెండ్లిళ్లు అయ్యాయి. అన్నయ్య నేషనల్ లెవల్ వాలీబాల్ ప్లేయర్. ఈమధ్యే తనకి ఓ పాప పుట్టింది. అమ్మ గృహిణి. నాన్న చనిపోయారు. వీళ్ళేకాదు, నన్ను అభిమానించే తెలుగు ప్రేక్షకులంతా నా కుటుంబంలో భాగమే. నాకు మంగళూరుకు, హైదరాబాద్‌కు పెద్ద తేడా అనిపించదు. హైదరాబాద్ రెండో ఇల్లులా అనిపిస్తుంది.
ప్రవళిక వేముల
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

