శీతకాలం చర్మంపై పగుళ్లు సహజమే. వాటివల్ల కలిగే దురద, మంట భరించలేం. వంటింటి దినుసులు, తైలాలతో చలికాలంలో వచ్చే వివిధ చర్మ సమస్యలను ఇలా నివారించవచ్చు..
శీతకాలం చర్మంపై పగుళ్లు సహజమే. వాటివల్ల కలిగే దురద, మంట భరించలేం. వంటింటి దినుసులు, తైలాలతో చలికాలంలో వచ్చే వివిధ చర్మ సమస్యలను ఇలా నివారించవచ్చు..
కలబంద గుజ్జులో సౌందర్యాన్ని పెంచే గుణాలున్నాయి. కలబంధ గుజ్జు రాసుకుంటే పగుళ్లు, దురద
తదితర సమస్యలు తగ్గుతాయి.
దురదగా అనిపించిన చోట ఆలివ్ ఆయిల్ మర్దన చేస్తే కండరాల లోపలి పొరల్లో కదలిక వస్తుంది. దురద, దద్దుర్లు ఉన్నచోట పూస్తే బ్యాక్టీరియా అభివృద్ధి చెందదు.
సోడా ఉప్పును నీళ్లలో కలిపి పేస్టులా చేసుకోవాలి. బొబ్బలు, పుండ్లు, దురద, దద్దుర్లు ఉన్న చోట రాసుకుని.. అయిదు నిమిషాల తర్వాత కడిగితే.. ఉపశమనం కలుగుతుంది.
ఓట్స్‌కు వాపులు, దురదను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఓట్స్ పిండిని బాత్ టబ్‌లో పోసి 15 నుంచి 20 నిమిషాలపాటు అందులో స్నానం చేస్తే చర్మానికి మేలు.
కోకో బీన్స్ నుంచి తీసిన సహజమైన కొవ్వును మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. ఇది సువాసన కూడా ఇస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మానికి వచ్చే చిన్నచిన్న సమస్యలను తగ్గిస్తుంది. పగుళ్లు, గాయాల వాపులు, దురద ఉన్న చోట క్రమం తప్పకుండా రాస్తే మంచి ఫలితం ఉంటుంది.