కంగన.. వీరాంగన! తనకంటూ బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. తనదే అయిన అభివ్యక్తి ఉంది. ఏ పాత్రలో అయినా ఒదిగిపోతుంది. సినిమా సినిమాకూ ఎదిగిపోతుంది.ఇప్పటికే ‘తలైవి’గా జీవించింది. త్వరలోనే ‘ఎమర్జెన్సీ’లో ఇందిరాగాంధీగా కనిపించనుంది.
పి.వాసు దర్శకత్వంలో చంద్రముఖి-2గా నంబర్ వన్ అభినయంతో అలరించబోతున్న కంగనా రనౌత్ ఓ ఫొటోషూట్లో ఇలా సంప్రదాయ లెహంగాలో హంగామా చేసింది.