H3N2 Virus Symptoms | ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి
H3N2 Virus Symptoms | ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లోని ఒక వేరియెంట్ పేరే.. హెచ్3ఎన్2. ఇది ప్రాథమికంగా పందులలో కనిపించే వైరస్. కాలక్రమంలో మనుషుల్లోనూ గుర్తించారు. బహుశా, వాటికి దగ్గరగా పనిచేసే వ్యక్తులకు తొలుత వ్యాపించి ఉంటుంది. ఆ తర్వాత ఇతరులకూ విస్తరించి ఉండవచ్చు. నాలుగేండ్ల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రుగ్మతను ఆరోగ్య సంక్షోభంగా ప్రకటించింది.
మేడమ్ నమస్తే. ఈమధ్య హెచ్3ఎన్2 వైరస్ గురించి తరచూ చర్చ జరుగుతున్నది. దీని లక్షణాలు ఏమిటి, ఎలా వస్తుంది?
– ఓ పాఠకురాలు
ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లోని ఒక వేరియెంట్ పేరే.. హెచ్3ఎన్2. ఇది ప్రాథమికంగా పందులలో కనిపించే వైరస్. కాలక్రమంలో మనుషుల్లోనూ గుర్తించారు. బహుశా, వాటికి దగ్గరగా పనిచేసే వ్యక్తులకు తొలుత వ్యాపించి ఉంటుంది. ఆ తర్వాత ఇతరులకూ విస్తరించి ఉండవచ్చు. నాలుగేండ్ల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రుగ్మతను ఆరోగ్య సంక్షోభంగా ప్రకటించింది. హెచ్3ఎన్2 వల్ల బాధపడుతున్న వ్యక్తులలో జ్వరం, దగ్గు, గొంతు గరగర, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, శ్వాస ఆడకపోవడం.. తదితర
లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థతో ముడి పడింది కాబట్టి, న్యుమోనియాకు కారణమైనా కావచ్చు.
ఆస్తమా, మధుమేహం, గుండె జబ్బులు, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ, నాడీ సంబంధ రుగ్మతలు ఉన్నవారికి ఈ సమస్య తోడైతే ప్రాణాంతకంగా మారవచ్చు. తుమ్ము, దగ్గు, స్పర్శ.. తదితర మార్గాలలో అంటుకుంటుంది కాబట్టి, సాధ్యమైనంత వరకూ జనసమూహాలకు దూరంగా ఉండాలి. మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రం చేసుకోకుండా మొహాన్ని ముట్టుకోకూడదు. ద్రవపదార్థాలు, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ అనున్యా రెడ్డి, ఇ.ఎన్.టి సర్జన్,
ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేసియల్ కాస్మొటిక్ సర్జన్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

