ఇలా చేస్తే గర్భస్రావానికి చెక్ పెట్టొచ్చు.. శాస్త్రవేత్తల పరిశోధనలో సంచలన విషయాలు..

పెండ్లయిన ప్రతి స్త్రీ మాతృత్వాన్ని కోరుకుంటుంది. ఏదో ఓ దశలో గర్భస్రావమైతే.. ఆ మహిళ బాధను మాటల్లో వర్ణించలేం. కొందరికైతే, పదేపదే గర్భస్రావాలు అవుతుంటాయి. అలాంటివారికి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అందిస్తే గర్భస్రావాలను నియంత్రించవచ్చని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా పరిశోధకులు చెబుతున్నారు. తల్లి గర్భంలోని మాయపైన, పిండంపైన ప్రభావం చూపే వ్యాధులను రోగ నిరోధక వ్యవస్థలో కీలకపాత్ర పోషించే ఎక్స్ట్రాథైమిక్ ఎయిరే, ఎక్స్ప్రెసింగ్ సెల్స్ అనే ఉపకణాలు అడ్డుకుంటున్నట్లు నిర్ధారించారు. మనం తీసుకునే ఆహారంపైనే ఈ రెండూ ఆధారపడి ఉంటాయి. వీటి సంఖ్య తగ్గిపోతే గర్భస్రావాలు జరిగే ఆస్కారం ఎక్కువని హెచ్చరిస్తున్నారు. ఎలుకలపై జరిపిన పరిశోధనలోనూ ఈ విషయం తేలింది. ఎక్స్ట్రాథైమిక్ ఎయిరే, ఎక్స్ప్రెసింగ్ కణాలు లేని ఎలుకల్లో గర్భస్రావ రిస్క్ రెండింతలు పెరిగిందని, పిండం ఎదుగుదలపై కూడా తీవ్ర ప్రభావం చూపిందని గుర్తించారు. ప్రొటీన్ ఫుడ్, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం ద్వారా ఈ కణాలను పెంచుకోవచ్చని సూచిస్తున్నారు పరిశోధకులు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

