HomeZindagiHow To Protect Your Pet Dog From The Harsh Summer Heat
వేసవి నుంచి రక్షణ
మండే ఎండలు మనుషులతోపాటు జంతువులపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా, పెంపుడు కుక్కల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి, వేసవి తాపం నుంచి వాటిని రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి.
మండే ఎండలు మనుషులతోపాటు జంతువులపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా, పెంపుడు కుక్కల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి, వేసవి తాపం నుంచి వాటిని రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి.
పెంపుడు జంతువులకు ఎల్లప్పుడూ తాజా, చల్లని నీరు అందుబాటులో ఉంచాలి. వాటి శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు రోజుకు 50 నుంచి 100 మిల్లీలీటర్ల నీరు అవసరం అవుతుంది. వేడిగాలులు ఎక్కువగా ఉంటే.. నీటి పరిమాణం కూడా రెట్టింపు చేయాలి.
ఎండల వల్ల జంతువుల జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి సులభంగా అరిగే ఆహారాన్ని అందించాలి.
మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. జంతువులను ఆరుబయట తిప్పడం మంచిదికాదు. ఎందుకంటే, ఎండవల్ల తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు బాగా వేడెక్కుతాయి. ఆ సమయంలో వాటిని నడిపిస్తే.. పాదాలకు బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, వాటిని ఇంటి లోపలే చల్లని ప్రదేశంలో ఉంచాలి.
వారానికి ఒకటి లేదా రెండుసార్లు సాధారణ నీటితో స్నానం చేయించాలి. దీనివల్ల వాటి శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
పెంపుడు జంతువుల్లో ఉక్కపోత తగ్గాలంటే.. వెంట్రుకల్ని చిన్నగా ట్రిమ్ చేయించాలి. అయితే పూర్తిగా.. తీయించడం కూడా మంచిదికాదు. ఎందుకంటే.. ఆ వెంట్రుకలే వాటిని ఎండదెబ్బ నుంచి కాపాడతాయి.
కుక్కలు అధికంగా రొప్పుతున్నా, నోటి నుంచి విపరీతంగా లాలాజలం కారుతున్నా, నీరసంగా పడి ఉండటం, వాంతులు చేసుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే పశు వైద్యుణ్ని సంప్రదించాలి.