Relationship | ఈ బంధం నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడంలేదు

పదేండ్లుగా నేను ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నాను. సంవత్సరం క్రితం వరకూ అంతా బాగానే ఉంది. కొన్నినెలలుగా అతని ప్రవర్తనలో తీవ్ర మార్పులు వచ్చాయి. మద్యానికి బానిసైపోయాడు. నన్ను మానసికంగా ఎంతో క్షోభకు గురిచేస్తున్నాడు. నలుగురిలో ఉన్నామని కూడా ఆలోచించకుండా, అసభ్య పదజాలంతో తిడుతున్నాడు. నన్ను బైక్ మీద ఎక్కించుకొని, ఉద్దేశపూర్వకంగా కిందపడేస్తాడు. లేదంటే ఏ గోడకో గుద్దేస్తాడు. దీంతో కొంతకాలం దూరం పెట్టేందుకు ప్రయత్నించాను. ఫోన్ చేసి ఏడ్చేవాడు.
జాలిపడి మళ్లీ తన దగ్గరకి వెళ్లిపోయాను. రెండేండ్ల క్రితం తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్తే, నా దగ్గరున్న బంగారమంతా ఇచ్చాను. వాటి కోసమైనా సరే, తనతో ఉండాలని అనుకున్నాను. కానీ ఆ ఇంట్లో ఉండటం ఏమాత్రం సురక్షితం కాదని అర్థమైపోయింది. దూరంగా వచ్చేశాను. ఇప్పుడేమో, మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు తీసుకున్న వ్యక్తిగత చిత్రాలను బయటపెడతానని బెదిరిస్తున్నాడు. ఎవరికైనా ఫిర్యాదు చేయాలన్నా, నా దగ్గర ఎలాంటి రుజువులూ లేవు. ఏం చేయాలో, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడంలేదు. దయచేసి నాకు సరైన పరిష్కారం సూచించండి. -ఓ సోదరి
జ : మీ పరిస్థితి నాకు పూర్తిగా అర్థమైంది. ఒక స్త్రీ అయిన మిమ్మల్ని బహిరంగ ప్రదేశంలో దూషించిన కారణంగా అతనిపై ఐపీసీ సెక్షన్ 509 కింద పోలీస్ కంప్లెయింట్ ఫైల్ చేయవచ్చు. అలాగే మీపై దౌర్జన్యం చేయడం, అవమానించడం వంటివి జరిగాయి కాబట్టి, ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు పెట్టొచ్చు. మీకు ఇష్టం లేకుండా మీ వ్యక్తిగత చిత్రాలను బహిర్గతం చేస్తానని బెదిరిస్తున్నందుకు ఐపీసీ సెక్షన్ 354సి కింద కూడా ఫిర్యాదు చేయవచ్చు. తర్వాత కూడా మీ ఇష్టానికి వ్యతిరేకంగా మీ చుట్టూ తిరగడం, వెంట పడటం లాంటివి చేస్తే, ఐపీసీ సెక్షన్ 354డిని ఉపయోగించుకోవచ్చు. ముందు మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్లండి. పైన చెప్పిన సెక్షన్ల కింద కేసు పెట్టండి. తర్వాత విషయాలన్నీ పోలీసులే చూసుకుంటారు. అతను మళ్లీ మీ దగ్గరకు వచ్చి హింసకు గురిచేసినా, ఫోన్ ద్వారా మానసికంగా వేధిస్తున్నా, ఈసారి అన్నిటినీ రికార్డ్ చేసుకోండి. మరోసారి ఇలాంటి చిక్కుల్లో పడకుండా జాగ్రత్త పడండి.
మానసి చౌదరి
అడ్వకేట్
www.pinklegal.in
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

