హోమ్‌వర్క్ భయాన్ని పసిగట్టండి
బడులు మొదలై పది రోజులు దాటింది. పాఠాలు మొదలయ్యాయి. ఇక హోమ్ వర్క్ భారం కూడా పెరుగుతుంది. సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలు పెట్టే బాధ్యతే కాదు పిల్లలు ఆ సిలబస్‌ని అర్థం చేసుకోవడం, చదవడంలో సంతోషంగా ఉన్నారా? ఒత్తిడికి గురవుతున్నారా? తెలుసుకోవడం టీచర్ల బాధ్యతే.
బడులు మొదలై పది రోజులు దాటింది. పాఠాలు మొదలయ్యాయి. ఇక హోమ్ వర్క్ భారం కూడా పెరుగుతుంది. సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలు పెట్టే బాధ్యతే కాదు పిల్లలు ఆ సిలబస్‌ని అర్థం చేసుకోవడం, చదవడంలో సంతోషంగా ఉన్నారా? ఒత్తిడికి గురవుతున్నారా? తెలుసుకోవడం టీచర్ల బాధ్యతే. ఈ సమస్య ఉంటే తల్లిదండ్రులు ముందుగా గుర్తించాలి. పిల్లలకు సపోర్ట్‌గా ఉండి, టీచర్లకు కూడా చెప్పాలి. అంతేకాని బాగా చదవాలని, పక్కవాళ్లతో పోల్చుతూ, తిడుతూ భయపెడితే పిల్లలు మానసికంగా కుంగిపోతారు. వేసవి సెలవుల్లో ఆడుతూ, పాడుతూ తిరిగిన పిల్లలు స్కూల్‌కి అలవాటైన వారం తర్వాత హోమ్ వర్క్ ఇవ్వడం మొదలవుతుంది. పిల్లలు ఆటలపై శ్రద్ధ, సమయ పాలన లేక తొలి నెలలో ఇబ్బంది పడతారు. హోమ్‌వర్క్ అధికంగా ఉంటే కొంతమంది పిల్లలు ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల తరచుగా తలనొప్పితో బాధపడతారు.
అప్పుడప్పుడూ కడుపునొప్పి కూడా వస్తుంటుంది. ఒత్తిడితో ఉన్నప్పుడు పళ్లు కొరకడం, దవడలు గట్టిగా బిగబట్టడం లాంటివి చేస్తుంటారు. సాధారణ రోజుల్లో నిద్రపోయినట్టుగా నిద్రపోరు. సమాయానికి నిద్ర పట్టదు. నిద్ర పుచ్చినా మధ్య మధ్యలో మేల్కొంటారు. ఒత్తిడి, మానసికంగా కుంగిపోకముందే కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు. గోళ్లు గిల్లుకోవడం, వేళ్లు కొరకడం లాంటివి చేస్తుంటారు. నెత్తిపై గీక్కోవడం, ఎదుటివ్యక్తి కళ్లలోకి కళ్లుపెట్టి చూడలేకపోవడం లాంటి ప్రవర్తనను కూడా గమనించవచ్చు. ఇలాంటి భయాలతో ఉన్న పిల్లలు తరగతి గదిలో ఇతరులతో త్వరగా కలవలేరు. భోజనం చేసినా నీరసంగా ఉంటారు. ఆటలాడకపోయినా అలసిపోయినట్టుగా ఉంటారు. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే టీచర్‌తో మాట్లాడి హోమ్‌వర్క్ భారం తగ్గించమని తల్లిదండ్రులే చెప్పాలి. అదే సమయంలో కొన్నిరోజులు తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉండి హోమ్‌వర్క్ చేయడంలో సాయపడాలి. అర్థం కానివి చెప్పే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు హోమ్‌వర్క్ భయం పోతుంది. క్లాస్‌రూమ్‌లో పిల్లలతో త్వరగా కలిసిపోతారు. చదువులో వేగం అందుకుంటారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

