Eye Brows | కనుబొమ్మలు నేత్ర సౌందర్యంలో భాగం. ముఖానికి అందం. తీర్చిదిద్ద్దినట్టు ఉండాలని కోరుకుంటారు అమ్మాయిలు. కానీ, కొందరి కనుబొమ్మలు మొదట్లో బాగానే ఉన్నా.. క్రమంగా పలుచబడతాయి. ఆ మార్పు మహిళను మానసికంగా కుంగదీస్తుంది. ఇలా జరగడానికి అనేక కారణాలు. సాధారణంగా నలభై పైబడిన తర్వాత, ఎంత దట్టమైన కనుబొమ్మలైనా పలుచబడటం సాధారణమే.
థైరాయిడ్ లోపంతోనూ ఇలా జరుగుతుంది. బ్యూటీపార్లర్ వాళ్లు కనుబొమ్మలను తీర్చిదిద్దే ప్రయత్నంలో.. బలవంతంగా పీకేస్తుంటారు. దీనివల్ల కుదుళ్లు బలహీనపడిపోయి రాలిపోయే ఆస్కారం ఉంది. పోషకాహార లోపం కూడా సమస్యకు కారణమే. కాబట్టి, సొంత చిట్కాలతో కాలాన్ని వృథా చేసుకోకుండా సౌందర్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.