బలమైనఎముకలు,దృఢమైన దంతాలకోసం ప్రతి ఒక్కరికీక్యాల్షియం కావాల్సిందే.రక్తపోటును, ఇన్సులిన్‌ను కూడా ఇదినియంత్రిస్తుంది. ఆరోగ్య కారణాల వల్ల నేరుగాడెయిరీ ఉత్పత్తులను తీసుకోలేనివారు ఇతర మార్గాలలో ఈ లోటు భర్తీ చేసుకోవచ్చు.
పుట్టగొడుగులు: విటమిన్-డి అనేది క్యాల్షియం శోషణలో మెరుగ్గా పనిచేస్తుంది. పుట్టగొడుగులలో విటమిన్-డి పుష్కలం.
తృణధాన్యాలు: రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు పుష్కలంగా ఉండాలి. వీటిద్వారా మెండైన క్యాల్షియం పొందవచ్చు.
పండ్ల రసాలు: కార్బొనేటెడ్ పానీయాలకు బదులుగా ద్రాక్ష, జామ తదితర పండ్ల రసాలు తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్-సి అందుతుంది.
నాన్ డెయిరీ పదార్థాలు : బాదం, ఓట్మీల్, బ్రెజిల్ నట్స్ వంటివి తరచూ తీసుకోవాలి. వీటిని తిన్నప్పుడల్లా 100 మిల్లీగ్రాముల క్యాల్షియం శరీరానికి అందుతుందని నిపుణులు చెబుతారు.
జున్ను: మరింత క్యాల్షియం కోసం ఆహారానికి జున్ను ముక్కలను జోడించాలి. అరకప్పు పాలతో వచ్చేంత క్యాల్షియం చిన్న జున్ను ముక్కలో ఉంటుంది.
ఆకుకూరలు: పాలకూర, క్యాబేజీ, బచ్చలికూరలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని తరచూ తినడం వల్ల మనకు అవసరమైనదానిలో 25% మేర క్యాల్షియం పొందవచ్చు. ఎముకల దృఢత్వానికి క్యాల్షియం ఎంతగానో తోడ్పడుతుంది. కానీ కెఫిన్, ఆల్కహాల్, సాఫ్ట్‌డ్రింక్స్ పూర్తిగా తగ్గించాలి.
నిపుణుల అంచనా ప్రకారం 19-50 సంవత్సరాల వయసులోని మహిళలకు రోజుకు 1000-1200 మిల్లీ గ్రాముల క్యాల్షియం అవసరం. మరీ అతిగా తీసుకోవడమూ మంచిది కాదు. దీనివల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు పోగయ్యే ప్రమాదం ఉంది.