ఎమర్జెన్సీ ఎంతో అనర్థం
ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ అనేది కలయిక తర్వాత గర్భాన్ని నిరోధించే ఒక సాధనం. జ్వరం మాత్రలతరహాలో ఇవి మందుల షాపుల్లో సులభంగా దొరుకుతున్నాయి. దీంతో ఇష్టారీతిగా వాడుతున్నారు.
గతంతో పోలిస్తే మార్కెట్లో ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ విరివిగా దొరుకుతున్నాయి. అయితే, వీటి వాడకం వల్ల అనర్థాలున్నాయని ఎక్కడో చదివాను. అసలు వీటిని ఎలా వాడాలి, ఎలాంటి సందర్భాల్లో వాడాలి?
ఓ పాఠకురాలు
ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ అనేది కలయిక తర్వాత గర్భాన్ని నిరోధించే ఒక సాధనం. జ్వరం మాత్రలతరహాలో ఇవి మందుల షాపుల్లో సులభంగా దొరుకుతున్నాయి. దీంతో ఇష్టారీతిగా వాడుతున్నారు. కలయిక సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, తర్వాత గర్భనిరోధానికంటూ ఎడాపెడా మింగే స్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్‌ను ఎలాంటి సందర్భాల్లో వాడాలన్న దాని మీద మనకు అవగాహన ఉండాలి.
రోజూ వాడే కాంట్రాసెప్టివ్ మాత్రలు పొరపాటున మర్చిపోయినా, కలయిక సమయంలో కండోమ్ చిరిగిపోయినా గర్భం రాకుండా ఉండాలంటే 72 గంటలలోపు వీటిని ఉపయోగించవచ్చు. రేప్ తరహా సంఘటనలు జరిగిన సందర్భాలలోనూ వాడవచ్చు.
అయితే, ఎలాంటి జాగ్రత్తలూ లేకుండా సంభోగంలోపాల్గొని.. ఆ తర్వాత మెడికల్ షాపుల నుంచి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ తెచ్చుకుని సొంతంగా వాడేయడం ఇటీవల ఎక్కువ అవుతున్నది. ఇది ఆడవాళ్ల ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టేస్తున్నది. ఎందుకంటే నోటి మాత్రల రూపంలో ఉండే వీటిని, గర్భ నిరోధకానికి వాడే కాంట్రాసెప్టివ్ పిల్స్‌తో పోలిస్తే అధిక మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ హార్మోన్లకు సంబంధించిన మాత్రలే. దీంతో శరీరంలో హార్మోన్ల అసమతౌల్యం ఏర్పడుతుంది. రుతుక్రమంలో ఎగుడుదిగుళ్లు వస్తాయి.
అధిక రక్తస్రావం జరుగుతుంది. వీటివల్ల ట్యూబ్ప్రెగ్నెన్సీలాంటివి ఏర్పడే ప్రమాదం ఉంది. అంటేర్భాశయంలో కాకుండా బయట (ఫాలోపియన్ ట్యూబ్‌లో) పిండం ఏర్పడుతుంది. అలాంటప్పుడు మధ్య మధ్యలో స్పాటింగ్ కనపడుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ అన్నది తెలీదు. ఇది అత్యంత ప్రమాదకరం. ఇలాంటి ప్రెగ్నెన్సీలో ట్యూబ్ పగిలిపోయి, అంతర్గత రక్త స్రావం జరుగుతుంది. దీనివల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్లూ ఉన్నారు. ఒక వ్యక్తి జీవితకాలంలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడాలి. అది కూడా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే. ఎందుకంటే, అందులో కూడా చాలా రకాలు ఉంటాయి. వాడాల్సిన మోతాదులోనూ తేడాలు ఉంటాయి. వాళ్లకు ఏది సరిపోతుంది అన్నది డాక్టర్లే చెప్పగలరు. అందుకే ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా సంభోగంలో పాల్గొంటే వెంటనే మీగైనకాలజిస్టునో, దగ్గరలో ఉన్న ఫ్యామిలీ క్లినిక్నోసంప్రదించడం మేలు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

