కాస్ట్యూమ్ డిజైనింగ్‌తో చరిత్ర సృష్టించింది!
చోళుల యుగం నేపథ్యంగా వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్' ఓ దృశ్యకావ్యం. అందులోనూ ఆ అలంకరణలు, ఆభరణాలు మనల్ని కాలయంత్రంలో వందల ఏండ్లు వెనక్కి తీసుకెళ్తాయి. కాస్ట్యూమ్ డిజైనర్ ఏకా లఖానీ ప్రతిభే ఇదంతా
చోళుల యుగం నేపథ్యంగా వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఓ దృశ్యకావ్యం. అందులోనూ ఆ అలంకరణలు, ఆభరణాలు మనల్ని కాలయంత్రంలో వందల ఏండ్లు వెనక్కి తీసుకెళ్తాయి. కాస్ట్యూమ్ డిజైనర్ ఏకా లఖానీ ప్రతిభే ఇదంతా. ఆ సృజన వెనకున్న నిద్రలేని రాత్రులు, నిరంతర అధ్యయనాలు లఖానీ మాటల్లోనే..
నాకు కాస్ట్యూమ్ డిజైనింగ్ అంటే ప్రాణం. న్యూయార్క్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాను. ఆ తర్వాత ‘మణిరత్నం ఫిల్మ్ స్కూల్’లో చేరాను. ఏ సినిమాకు ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడాలన్నది అక్కడే నేర్చుకున్నాను. సబ్యసాచి ముఖర్జీ ‘రావన్’ సినిమాకు పనిచేస్తున్న సమయంలో.. నేను ఆయన దగ్గర ఇంటర్న్‌షిప్ చేశాను. ఆ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా వ్యవహరించిన సంతోష్ శివన్ నా పనికి మెచ్చి.. ‘ఉరిమి’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం కల్పించారు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కాదల్’, ‘ఓకే కణ్మణీ’ తదితర చిత్రాలకు చేశాను.
‘పొన్నియిన్ సెల్వన్-1’ అనే ఓ అద్భుత దృశ్యకావ్య రూపకల్పనలో నా వంతు పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది. ఇదో విజువల్ వండర్. చాలా రీసెర్చ్ చేశాను. చోళ వస్త్రకళా వైభవాన్ని నేటి తరానికి చూపేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. పాత పెయింటింగ్స్, శిల్పాలు అధ్యయనం చేశాను. ప్రాచీన తమిళ సాహిత్యాన్ని చదివాను. సుప్రసిద్ధ మ్యూజియంలకు వెళ్లాను. భటుడి నుంచి రాజు వరకూ ఎవరు ఎలాంటి దుస్తులు ధరిస్తారు? మహారాణుల ఆహార్యం, అలంకరణ ఎలా ఉంటాయి? అనే కోణంలో స్కెచ్‌లు గీసుకున్నాను. మాది ముంబై కాబట్టి.. తమిళుల చరిత్ర గురించి నాకు చాలా తక్కువగా తెలుసు. ఈ సినిమా కోసం చేసిన అధ్యయనంతో ఆ లోటు తీరిపోయింది. అభిమానుల స్పందన చూస్తుంటే నా కష్టం దూదిపింజలా ఎగిరిపోయింది. ఇలాంటి సినిమాలు చేయడం ఓ గొప్ప అనుభూతి. ఒక్కో క్యారెక్టర్ ఓ ఆణిముత్యం. అవకాశం ఇచ్చిన మణిరత్నం సార్‌కు రుణపడి ఉంటాను. త్వరలో పట్టాలెక్కనున్న కమల్‌హాసన్- మణిరత్నం సినిమాకు కూడా నేనే కాస్ట్యూమ్ డిజైనర్‌ని.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

