చర్మానికీ ఒత్తిడి!
ఒత్తిడి.. రోజువారీ జీవితంలో భాగం అవుతున్నది. ఆ ప్రభావం శరీరంలోని అన్ని వ్యవస్థలనూ దెబ్బతీస్తున్నది. చర్మాన్ని కూడా వదలడం లేదు. ఒంటి మీద ముడతలు, కళ్ల కింద క్యారీబ్యాగులు
ఒత్తిడి.. రోజువారీ జీవితంలో భాగం అవుతున్నది. ఆ ప్రభావం శరీరంలోని అన్ని వ్యవస్థలనూ దెబ్బతీస్తున్నది. చర్మాన్ని కూడా వదలడం లేదు. ఒంటి మీద ముడతలు, కళ్ల కింద క్యారీబ్యాగులు వచ్చేస్తున్నాయి.
కళ్లు
కనురెప్పల కింద వాపు కారణంగా కళ్ల కింద సంచుల్లాంటి ఉబ్బెత్తు నిర్మాణాలు ఏర్పడతాయి. వయసు పెరిగేకొద్దీ కనుగుడ్డును పట్టి ఉంచే కండరాలు బలహీనపడటం వల్ల ఇలా జరుగుతుంది. ఒత్తిడి ప్రభావంతో ఈ సమస్య అధికం అవుతుంది. నిద్రలేమి కూడా ఒత్తిడి ఫలితమే. దీంతో చర్మం మీద ముడతలు ఏర్పడతాయి. చర్మం కాంతి విహీనం అవుతుంది, రంగు మారుతుంది.
దద్దుర్ల సమస్య
ఒత్తిడి రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీనివల్ల పొట్ట, చర్మంలోని బ్యాక్టీరియాలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇలా జరిగినప్పుడు చర్మం మీద దద్దుర్లలాంటివి ఏర్పడవచ్చు.
చర్మం
చర్మం బయటి పొరల్లో తేమను నిలిపి ఉంచడంలో కొన్నిరకాల ప్రొటీన్ల్లు, లిపిడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. లోపలి చర్మాన్ని కాపాడేందుకూ దోహదపడతాయి. ఒత్తిడి కారణంగా ఇవి సరిగ్గా పనిచేయకపోతే చర్మం పొడిబారిపోయి, దురదలు వచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు చర్మ రుగ్మతలూ ఇబ్బందిపెడతాయి.
మొటిమల బాధ
శరీరం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసోల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఆ ప్రభావం వల్ల మెదడు సీఆర్హెచ్ (కార్టికాట్రోఫిన్-రిలీజింగ్ హార్మోన్)ను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంలో తైల గ్రంథులను ప్రేరేపించి చర్మం మీద భారీగా నూనెలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వచ్చేస్తాయి.
పెదాలు
తీవ్రమైన ఒత్తిడి నోటి ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుంది. దీంతో పెదవులపైనా, నోటిలోనూ పుండ్లు ఏర్పడవచ్చు.
మొహం
ఒత్తిడిలో మనం శ్వాస తీసుకునే విధానమూ మారుతుంది. గబగబా ఊపిరి తీసుకోవడం వల్ల తాత్కాలికంగా మొహం ఉబ్బరానికి గురవుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Depression
- Effect
- Face
- skin
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

