అమ్మపైనే ఆధారపడుతా!

నా వయసు 19 ఏండ్లు. ప్రతి చిన్న విషయానికి అమ్మపైనే ఆధారపడుతుంటాను. చదువుకునేటప్పుడు కూడా నా పక్కనే ఉండమని అడుగుతుంటా. ఎప్పుడైనా అమ్మ పనిమీద వేరే ఊరికి వెళ్లినప్పుడు, ఏదో పోగొట్టుకున్నట్టు ఫీలవుతుంటా! ఇలా చేస్తున్నందుకు చాలాసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. నా అంతట నేనుగా పనులు చేసుకోలేకపోతున్నాను. దయచేసి ఈ విషయంలో సాయం చేయగలరు!
ఓ సోదరి పుట్టుకనుంచే పిల్లలు తమ తల్లిదండ్రులపై ఆధారపడటం సహజం. ప్రతిపనిలో వాళ్ల సాయం తీసుకోవడమూ సాధారణమే. అయితే, యుక్త వయసు రాగానే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు. కానీ, ముఖ్యమైన విషయాల్లో పిల్లలు అమ్మానాన్నలపై ఎంతోకొంత ఆధారపడతారు. కాకపోతే మీ విషయంలో పరిస్థితి కొద్దిగా వేరుగా ఉంది. దీన్ని సోషల్ సైకాలజిస్ట్‌లు ‘లెర్న్డ్ బిహేవియర్’గా చెప్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు లైఫ్స్కిల్స్పై అవగాహన కల్పించకపోవడమే ఇందుకు ముఖ్యకారణం. మీరు ఈ పరిస్థితిని అధిగమించాలంటే కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.
- ముందుగా మీరు ఏ విషయాల్లో, ఎందుకు అమ్మపై ఆధారపడుతున్నారో గుర్తించాలి. అది న్యూనతా భావనా లేక మీరు తీసుకునే నిర్ణయాలపై మీకే నమ్మకం లేకపోవడమా అన్నది తెలుసుకోవాలి. మీకేమైనా భయాందోళనలు ఉంటే వాటి వెనుకున్న విషయాలను పేరెంట్స్‌తో షేర్ చేసుకోండి.
- ఒక్కసారి కారణాలు తెలుసుకున్నాక సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాలి. ఆలోచనలు, భావోద్వేగాలపై నియంత్రణ తెచ్చుకోవాలి.
- సోషల్ నెట్వర్కింగ్ పెంచుకోవాలి. స్నేహితులతో సంభాషించాలి. ఇలా సోషల్ గ్రూప్స్‌లో చురుగ్గా పాల్గొనడం వల్ల కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
- చిన్నచిన్న బాధ్యతలను తీసుకుని వాటిని సొంతంగా పూర్తి చేయాలి. అందులో విఫలమైతే ఒత్తిడికి గురవ్వకుండా, లోపం ఎక్కడ జరిగిందో గమనించాలి. అనుభవాలే గొప్ప పాఠాలు నేర్పుతాయి.
- ముందుగా మిమ్మల్ని మీరు గుర్తించాలి. ‘సెల్ఫ్ లవ్’ గురించి తెలుసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించగలిగితేనే మీపై నమ్మకం కుదురుతుంది. ఇలా చేస్తూ ఉంటే, మీ ప్రవర్తనలో కచ్చితంగా మార్పు వస్తుంది.
నల్లన్ రాధిక ఆచార్య
క్లినికల్ సైకాలజిస్ట్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

