చెక్కతో అద్భుతాలు!
ఇద్దరికీ చెక్కలతో అద్భుతాలు సృష్టించడమంటే ఇష్టం. చెన్నైలో ఓ స్టూడియోను ప్రారంభించి.. తమను కలిపిన కలపతో చమత్కారాలు చేస్తున్నారు అనీష్ చెరియన్, శైలనా వాధ్వా. ‘కలపతో ప్రయోగాలు చేయడం చాలా సులభం. అయితే అందుకు కళాత్మక హృదయం తప్పనిసరి’ అంటారు ఆ దంపతులు. అహ్మదాబాద్‌లో ఆర్కి టెక్ట్స్‌గా మొదలైన వీరి ప్రయాణం ‘మూడు చెక్కలు.. ముప్పై ఆరు కళాకృతులు’గా
ఇద్దరికీ చెక్కలతో అద్భుతాలు సృష్టించడమంటే ఇష్టం. చెన్నైలో ఓ స్టూడియోను ప్రారంభించి.. తమను కలిపిన కలపతో చమత్కారాలు చేస్తున్నారు అనీష్ చెరియన్, శైలనా వాధ్వా. ‘కలపతో ప్రయోగాలు చేయడం చాలా సులభం. అయితే అందుకు కళాత్మక హృదయం తప్పనిసరి’ అంటారు ఆ దంపతులు. అహ్మదాబాద్‌లో ఆర్కి టెక్ట్స్‌గా మొదలైన వీరి ప్రయాణం ‘మూడు చెక్కలు.. ముప్పై ఆరు కళాకృతులు’గా సాగుతున్నది. ఆ దంపతుల కలల పంట.. ‘స్టూడియో క్లటర్’. ఇక్కడ జీవం పోసుకునే కళాకృతులను ఆన్లైన్లో విక్రయిస్తున్నారు.
టేకు ఎన్నేండ్లయినా చెక్కు చెదరదు. కాబట్టి.. ఎక్కువగా టేకునే ఎంచుకుంటారు. నాణ్యమైన ముడిసరుకు కోసం ఇద్దరూ కలిసి అడవుల బాట పడతారు కూడా. ఇక, నిత్యం కలపతో అనేక ప్రయోగాలు చేస్తుంటారు. ప్రతినెలా రెండో ఆదివారం వర్క్‌షాప్ తప్పనిసరిగా నిర్వహిస్తారు. studioclutter.com వెబ్సైట్లో ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. నచ్చినవన్నీ కొనుగోలు చెయవచ్చు. మీరే ఓ శిల్పిగా మారాలనుకుంటే వర్క్‌షాప్‌లకు హాజరుకావచ్చు. ఎంత ‘చెక్క’ని వ్యాపారమో!


Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Couple
- creative
- wonder art
- wood art
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

