బటర్ గార్లిక్ చికెన్
ఒక గిన్నెలో చికెన్, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మైదా వేసి బాగా కలపాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి నూనె వేసి.. బాగా వేడయ్యాక చికెన్ ముక్కల్ని పరిచి సన్నని మంటపై రెండు వైపులా తిప్పుతూ వేయించాలి
కావలసిన పదార్థాలు
చికెన్(బోన్‌లెస్): అర కిలో, వెల్లుల్లి రెబ్బలు: పది, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు, నూనె: ఒక టేబుల్ స్పూన్, ఆరిగానో: అర టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, రెడ్‌చిల్లీ సాస్: ఒక టేబుల్ స్పూన్, మైదా: రెండు టేబుల్ స్పూన్లు, చికెన్ ఉడికించిన నీళ్లు: అర కప్పు, కొత్తిమీర తురుము: కొద్దిగా.
తయారీ విధానం
ఒక గిన్నెలో చికెన్, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మైదా వేసి బాగా కలపాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి నూనె వేసి.. బాగా వేడయ్యాక చికెన్ ముక్కల్ని పరిచి సన్నని మంటపై రెండు వైపులా తిప్పుతూ వేయించాలి. దోరగా వేగిన చికెన్ తీసి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో వెన్నవేసి.. వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ మైదా వేసి వేయించాలి. చికెన్ ఉడికించిన నీళ్లు, ఆరిగానో, ఉప్పు, మిరియాల పొడి, రెడ్‌చిల్లీ సాస్ వేసి కలుపుతూ దగ్గర పడేవరకు ఉడికించాలి. చికెన్ ముక్కల్ని జోడించి, బాగా కలిపి పైనుంచి కొత్తిమీర తురుము చల్లుకుంటే నోరూరించే బటర్ గార్లిక్ చికెన్ సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

