కావలసిన పదార్థాలు
బ్రెడ్ స్లైసెస్: ఆరు, పనీర్ తురుము: ఒక కప్పు, సన్నగా తరిగిన క్యాప్సికమ్: ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి, మిరియాల పొడి, ఆమ్చూర్, చాట్ మసాలా, కారం, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా, వెన్న: ఒక టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ: పావు కప్పు.
తయారీ విధానం
ఒక గిన్నెలో పనీర్ తురుము, క్యాప్సికమ్, ధనియాల పొడి, మిరియాల పొడి, ఆమ్చూర్, చాట్‌మసాలా, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని పొడవైన కోఫ్తాల్లా చేసిపెట్టుకోవాలి. బ్రెడ్ ైస్లెసుల్ని అంచులు కట్ చేసి చపాతీ కర్రతో ఒకసారి ఒత్తి పైనుంచి గ్రీన్ చట్నీ రాసి,అప్పటికే సిద్ధంచేసుకున్న పనీర్ కోఫ్తాలను పెట్టి రోల్ చెయ్యాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి, వెన్న వేసి, వేడయ్యాక వీటిని వేసి సన్నని మంటపై రెండువైపులా కాల్చుకుంటే వేడివేడి బ్రెడ్ పనీర్ రోల్స్ సిద్ధం.