హెపటైటిస్‌తో జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయొద్దు!
వర్షాకాలంలో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధుల్లో ముఖ్యమైంది హెపటైటిస్-ఎ. ఈ రుగ్మతను నివారించడం సాధ్యమే. హెపటైటిస్-ఎ అనే వైరస్ వల్ల కాలేయానికి వచ్చే రుగ్మత ఇది.
వర్షాకాలంలో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధుల్లో ముఖ్యమైంది హెపటైటిస్-ఎ. ఈ రుగ్మతను నివారించడం సాధ్యమే. హెపటైటిస్-ఎ అనే వైరస్ వల్ల కాలేయానికి వచ్చే రుగ్మత ఇది. ఈ వైరస్ నోటిద్వారా ప్రవేశించి, మలంద్వారా విసర్జితం అవుతుంది. వైరస్‌తో కలుషితమైన ఆహారం తిన్నా, నీళ్లు తాగినా.. ఇట్టే సోకుతుంది. బాగా ఉడికించని కూరగాయలు, చేపలు, రొయ్యలు, పళ్లు, సలాడ్స్ ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి పాఠశాలలు, డేకేర్ సెంటర్లు, హాస్టల్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. పరిసరాల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత లోపించిన చోట తిష్ట వేస్తుంది.
వ్యాధి ప్రారంభదశలో రోగిలో స్పష్టమైన లక్షణాలు ఉండవు. ఫ్లూ లాగానే అలసట, కండరాల నొప్పి, ఆకలి తగ్గడం, వాంతులు, దగ్గు, జలుబు ఇబ్బందిపెడతాయి. రెండు సంవత్సరాల లోపు పిల్లల్లో అసలు వ్యాధి లక్షణాలే కనిపించకపోయినా.. వ్యాధి వ్యాప్తిలో మాత్రం ఆ చిన్నారులు ప్రధానపాత్ర పోషిస్తారు. ముఖ్యంగా, రెండేండ్లు దాటిన 60 శాతం పిల్లల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. కడుపు కుడివైపున నొప్పి, వాంతులు, ఆకలి మందగించడం ప్రధాన లక్షణాలు.
ఆ తరువాత కళ్లు, చర్మం పచ్చబడతాయి. మూత్రం పచ్చగా, మలం తెల్లగా వస్తాయి. ప్రథమ దశ నాలుగు వారాల నుంచి మూడు నెలల వరకూ ఉంటుంది. అన్ని వయసుల పిల్లలనూ ఇది ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా వాంతులు ఎక్కువ, ఆకలి మందగిస్తుంది. నాలుగైదు వారాలపాటు చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అవుతారు. కోలుకోవడానికి ఆరు నెలలు పట్టవచ్చు. ఇరవై శాతం పిల్లల్లో వ్యాధి తిరగబెట్టవచ్చు. ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి కాబట్టి, పూర్తిగా మందులతోనే వైద్యం చేయలేం.
లక్షణాలు: తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు, తల నొప్పితో ప్రారంభమై అవి తగ్గిపోయే దశలో ముక్కునుంచి నీరు కారడం, దగ్గు, ఛాతీలో మంట మొదలవుతాయి. దగ్గు ఒకటిరెండు వారాలు కొనసాగవచ్చు. చిన్నపిల్లల్లో అరుదుగా న్యుమోనియాకూ దారి తీయవచ్చు. రెండు సంవత్సరాల వయసు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
నివారణ: దగ్గు, తుమ్ము వల్ల ఫ్లూ వ్యాపిస్తుంది. కాబట్టి వ్యాధి సోకినవారు ఇతరులకు దూరంగా ఉండాలి. దగ్గులు, తుమ్ములు వచ్చినప్పుడు ఇతరులపై లాలాజలం పడకుండా నోటికి చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయరాదు. తీవ్రమైన ఆస్తమా, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారిలో ఫ్లూ తీవ్రంగానూ, దీర్ఘకాలికంగానూ ఉండే అవకాశం ఎక్కువ.
టీకా: బిడ్డకు ఆరు నెలల వయసు దాటిన తరువాత మొదటి డోసు ఇవ్వాలి. ఒక నెల తరువాత రెండో డోసు ఇవ్వాలి. తొమ్మిది సంవత్సరాలు నిండిన వారికి ఒక డోసు సరిపోతుంది. ఈ టీకాను ప్రతి సంవత్సరం ఇవ్వాలి. వర్షాకాలం ప్రారంభానికి ముందు ఇస్తే బాగా ఉపయోగపడుతుంది.
డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి :పిల్లల వైద్య నిపుణులు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- chills
- Fever
- Headache
- hepatitis A
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

