HomeZindagiAvoid Helicopter Parenting Let Kids Learn On Their Own
హెలికాప్టర్ పేరెంటింగ్ వద్దు
పిల్లలను స్వతంత్రంగా ఎదగనిస్తూ, వారు చేసే తప్పులను సరిదిద్దుతూ బాధ్యత నేర్పడమే తల్లిదండ్రుల కర్తవ్యం. కాబట్టి, పిల్లల జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. ‘హెలికాప్టర్ పేరెంట్'గా మిగిలిపోకండి.
పిల్లలను స్వతంత్రంగా ఎదగనిస్తూ, వారు చేసే తప్పులను సరిదిద్దుతూ బాధ్యత నేర్పడమే తల్లిదండ్రుల కర్తవ్యం. కాబట్టి, పిల్లల జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. ‘హెలికాప్టర్ పేరెంట్’గా మిగిలిపోకండి.
పిల్లలకు ఓటములు ఎదుర్కోవడానికి అవకాశం ఇవ్వాలి. పొరపాట్లే జీవితాన్ని బోధించే మైలురాళ్లు. ఒక్కసారి తమ పరిస్థితికి తామే కారణమని పిల్లలు తెలుసుకుంటే, మరింత బాధ్యతగా మెలగుతారు.
పిల్లల్ని మరీ అపురూపంగా పెంచకూడదు. కిందపడుతుంటే పట్టుకోవాలి. ఓడిపోతున్నప్పుడు మార్గనిర్దేశం చేయాలి. అసలు పడిపోకుండా మొదట్లోనే ఆపేయకూడదు.
పిల్లలకు హోంవర్క్‌లో సాయం చేయాలనుకుంటే, వారు ఆలోచించడానికి అవకాశం ఇవ్వాలి. అంతేతప్ప పెద్దలే హోంవర్క్ చేసిపెట్టకూడదు. పిల్లల్ని తాము చేస్తున్న పనులకు పర్యవసానాలు ఎదుర్కొనేందుకు సంసిద్ధం చేయాలి. ప్రతి చిన్నదానికీ పరిగెత్తకూడదు. ఇలా చేస్తే.. ఎప్పటికీ స్వతంత్రంగా ఎదగలేరు.