Anusri Tripathi | పట్టుచీర కడితే అమ్మాయి బుట్టబొమ్మలా కనిపిస్తుంది. దానికి ఫ్యాషన్ లుక్‌ని తీసుకొచ్చేలా స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ని ధరించి ఫొటోకి పోజులిచ్చింది రజాకార్ సినిమా నటి అనుశ్రీ త్రిపాఠి. గులాబీ, బంగారు వర్ణాల కలనేతగా వచ్చిన చీర మీద వెండి రంగు మోటిఫ్‌లు కళను తీసుకొచ్చాయి.
దానికి జతగా అదే రంగుల మేళవింపుగా ఉన్న రాళ్ల నెక్లెస్, దుద్దుల్ని ధరించి అందానికే అందాన్ని అద్దిందీ అమ్మడు. కుందన్ గాజులు, రాళ్లూ పూసలూ కలగలిపిన ఉంగరాలు… చందనపు బొమ్మను చందమామలా చూపుతున్నాయి.
– సి.ఎం. ప్రవీణ్