భారతీయ మహిళలకు చేనేత చీరలపై మమకారం ఎక్కువే. నేతకు ఓ బ్రాండ్ విలువ తీసుకురావడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఓ అడుగు ముందుకేసి.. చేనేత చీరలతో
ఫర్నిచర్ కవర్లు కూడా తయారు చేస్తున్నారు ఢిల్లీలోని ‘లైమన్’ కంపెనీ వ్యవస్థాపకురాలు అనూరాధ ఆనంద్. మరీ ముఖ్యంగా కుర్చీలను నేత చీరలతో మరింత అందంగా ముస్తాబు చేస్తున్నారు అనూరాధ. బెనారస్, బాందినీ, పునేరీ చెక్స్, ఇక్కత్ చీరలతో చేసిన కుర్చీ కుషన్లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే వివిధ రాష్ర్టాల్లోని ప్రత్యేక ప్రింట్లు, ప్యాటర్న్లతో కుర్చీ వెనుకభాగంలో పెయింట్ వేయిస్తుండటం విశేషం. పన్నెండు సంవత్సరాలు కార్పొరేట్ వ్యవస్థలో పనిచేసిన అనూరాధ ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనే ఉద్దేశంతో దేశమంతా పర్యటించారు. అప్పుడే, ఈ ఆలోచన వచ్చింది. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కొనుగోలుదారులు కోరినట్టు కుర్చీల కుషన్లు తయారుచేసి ఇస్తున్నారు. అలంకరణకు అవసరమైన చీరలను కూడా, దళారుల ప్రమేయం నేరుగా నేత కళాకారుల నుంచే కొనుగోలు చేస్తున్నారు అనూరాధ.