New Born Babies | పిల్లల్లో జలుబు, దగ్గు లాంటి సమస్యలు త్వరగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ శ్వాసకోశ వ్యాధులు ప్రాణాంతకంగానూ మారుతాయి. ఇలా ఎందుకు జరుగుతున్నదనే విషయం మీద ఈమధ్యనే ఓ కీలక పరిశోధన ఫలితం వెలువడింది. పుట్టిన తొలి రోజుల్లోనే పిల్లలు ఏదైనా వైరస్ బారినపడితే, దానివల్ల శరీరంలో రక్షణ వ్యవస్థ తీవ్రంగా స్పందిస్తుందట. ఈ అనుభవంతో ఊపిరితిత్తులు త్వరగా స్పందించేలా వంట్లో సర్దుబాట్లు జరుగుతాయి. అప్పుడే పుట్టిన పిల్లల మ్యూకస్ కణజాలాన్ని పరిశీలించిన తర్వాత నిపుణులు తేల్చిన విషయం ఇది. దవాఖాన వాతావరణం, తల్లిపాలు పట్టడం లాంటి విషయాలు కూడా పిల్లల తొలినాటి రక్షణ వ్యవస్థను తీర్చిదిద్దుతాయని తేలింది. కాబట్టి చాదస్తం అనుకోకుండా, తొలి రోజుల్లో పిల్లలను అపురూపంగా చూసుకోవాల్సిందే!