తెలుగమ్మాయికి అవకాశాల్లేవ్!

చిన్నప్పటి నుంచి కెమెరా ముందు కనపడం అంటే ఇష్టం. యాంకర్‌గా ఎందరినో మెప్పించాలనుకుంది. అదే లక్ష్యంతో కుటుంబంతో హైదరాబాద్‌కు చేరుకుంది. కానీ, ఆమె అనుకున్నది జరగలేదు. తెలుగమ్మాయని సరైన అవకాశాలు ఇవ్వడం లేదంటున్నది నటి రీతూ చౌదరి. పరిశ్రమలో తెలుగమ్మాయిలపై వివక్ష కొనసాగుతున్నదని చెబుతున్నది. హీరోయిన్గా కాకుండా విలన్, చిన్నచిన్న పాత్రలతో సర్దుకుపోవాల్సి వస్తున్నదని తన మనసులోని మాటను ‘జిందగీ’తో పంచుకుంది రీతూ చౌదరి.
మాది తెలంగాణలోని ఖమ్మం జిల్లా. చిన్నప్పటి నుంచి చాలా చలాకీ! స్కూల్లో, కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనేదాన్ని. యాంకర్ అవ్వాలనే కోరికతో గలగలా మాట్లాడేదాన్ని. డిగ్రీ తర్వాత ఇండస్ట్రీలో ప్రయత్నించాలనుకున్నా. నాకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మా కుటుంబం అంతా నా కోసం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది.
ఏడాది ప్రయత్నం తర్వాత
‘ఇండస్ట్రీలో అవకాశాలు దొరకడం.. హైదరాబాద్‌కు రావడమంత తేలిక కాదు’ అని తొందర్లోనే అర్థమైంది. ఇండస్ట్రీలో తెలిసినవారు ఎవరూ లేకపోవడం చాలా మైనస్ అయింది. అవకాశాల కోసం రోజూ ప్రొడక్షన్ హౌస్‌ల చుట్టూ తిరిగేదాన్ని. ఫొటోలు, వీడియోలు ఆడిషన్స్‌కు పంపేదాన్ని. ఇన్ని చేసినా మొదటి అవకాశం రావడానికి ఏడాది పట్టింది. అది కూడా యాంకర్‌గా అవకాశం రాలేదు. ‘ఈ టీవీ’లో ప్రసారమైన ‘ఆడదే ఆధారం’ సీరియల్లో ఓ చిన్న పాత్రలో అవకాశం వచ్చింది. చిన్నదే అయినా, వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఒప్పుకొన్నా. మొత్తానికి చాలా కష్టాల తర్వాత బుల్లితెర మీద కనిపించా.
మళ్లీ మామూలే
‘ఆడదే ఆధారం’ సీరియల్ అయిపోయాక మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. మళ్లీ ప్రొడక్షన్ హౌస్‌ల చుట్టూ తిరగడం, ఫొటోలు పంపడం ఇదీ తంతు. కొన్నాళ్లకు ‘జీ తెలుగు’లో ప్రసారమైన ‘ప్రదీప్ పెళ్లిచూపులు’లో అవకాశం వచ్చింది. ఓ ఆర్నెల్లు బాగానే గడిచింది. ఆ షో అయిపోయాక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆ షో ప్రభావమో ఏమో తెలియదు గానీ, ఒక్క అవకాశం వచ్చేదికాదు. కొన్నిసార్లు కోపంతో ఎండలో ప్రొడక్షన్ హౌజ్‌లకు, ఎక్కడెక్కడికో నడిచి వెళ్లేదాన్ని. ‘ఈ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా?’ అని బాధపడిన క్షణాలు లెక్కలేనన్ని. ప్రస్తుతం ‘ఈ టీవీ’లో ప్రసారమవుతున్న ‘అత్తారింటికి దారేది’ సీరియల్లో ఓ పాత్రలో నటిస్తున్నా. ఎవరిమీదా ఆధారపడకుండా యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా. ఎన్ని కష్టాలు ఎదురైనా నా కుటుంబం నాకెప్పుడూ అండగా ఉంది. మా అన్నయ్య ఇచ్చే ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను.

చెప్పలేనంత తేడా
తెలుగు ఇండస్ట్రీలో అందరూ తెలుగువాళ్లే అనుకుంటారు. మిగతా పాత్రల్లో తెలుగు వాళ్లు ఉన్నా, హీరోయిన్ పాత్రలకు వచ్చేసరికి తెలుగమ్మాయిలు చాలా తక్కువ. ఓ పదిమంది వరకు మాత్రమే అవకాశాలు పొందగలుగుతున్నారు. పక్క రాష్ర్టాలకు చెందిన అమ్మాయిలకే హీరోయిన్గా ఎంచుకుంటున్నారు. తెలుగు అమ్మాయిలతో పోలిస్తే చెన్నై, బెంగళూరు అమ్మాయిలు ఏం ఎక్కువ చేస్తారో అర్థం కాదు. కనీసం, వాళ్లకు భాష కూడా రాదు. వాళ్లకు సీన్ అర్థమయ్యేలా వివరిస్తూ, డబ్బింగ్ చెప్పిస్తూ వాళ్లతోనే చేయించుకుంటారు గానీ, తెలుగమ్మాయిలకు అవకాశం ఇవ్వరు. పైగా ప్రొడక్షన్, అకామిడేషన్‌లో వాళ్లకూ, మాకూ చెప్పలేనంత తేడా ఉంటుంది. ఇండస్ట్రీకి రావాలనుకునే నాలాంటి అమ్మాయిలు నిరాశపడకుండా ఉండే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నా!
ప్రవళిక వేముల
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- ritu
RELATED ARTICLES
తాజా వార్తలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

