అందానికి..అపాక్సీ నగలు!

కొందరంతే! మల్లెలు ఫలహారంగా, గులాబీలు భోజనంగా, నందివర్ధనాలు రాత్రి విందుగా ఆరగిస్తారేమో అన్నంత సౌకుమార్యం! నీటికి బదులు పన్నీటితో గొంతు తడుపుకొంటారేమో అనిపించేంత లాలిత్యం! ఆ సుకుమారికి బంగారు నగలతో మెడ కందిపోతుందేమో, ప్లాటినం ఉంగరంతో వేళ్లు కమిలిపోతాయేమో. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ప్రకృతి స్వరూపమైన స్త్రీ ప్రకృతి ద్రవ్యాలతోనే ముస్తాబు చేసుకోవాలి. ‘అపాక్సీ జువెలరీ’ ఆ సౌందర్యారాధనలో ప్రధాన పూజాద్రవ్యం.
గులాబీల జూకాలు, మల్లెల ముక్కెరలు, బంతిపూల హారాలు, కాగితం పూల గొలుసులు… ఇలా రకరకాల ఆకృతుల్లో వైవిధ్యమైన లాకెట్స్, పెండెంట్స్, ఇయర్ రింగ్స్
చేసుకోవచ్చు. ప్రకృతిలో పుష్కలంగా లభించే పూలు, ఆకులపై రెసిన్ అనే పదార్థాన్ని పోసి వీటిని తయారుచేస్తారు. దీంతో ఎన్నేండ్లయినా రంగు కోల్పోవు. పూలు, ఆకులు, ద్రవరూప గాజు.. ఈ నగలకు ముడిసరుకు.
ఈ మధ్య యూట్యూబ్, ఫేస్బుక్.. వంటి సామాజిక మాధ్యమాల్లో ద్రవరూప అపాక్సీ(రెసిన్)తో తయారుచేసే రకరకాల ఆకృతులు, ఆభరణాల వీడియోలే కనిపిస్తున్నాయి. బంగారం, వెండితో పనిలేకుండానే.. అతి తక్కువ ధరలో, అంతులేని డిజైన్లలో లభించే ఈ నగల పట్ల మగువలు మక్కువ చూపుతున్నారు. ఆధునిక వస్ర్తాలంకరణకు నప్పేలా పెండెంట్లు, బ్రేస్లెట్లు తీరొక్క డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ నగల తయారీనే కెరీర్‌గా ఎంచుకుని, తమ డిజైన్లను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నవారూ అనేకం.
నాజూకైన వేళ్లకు రెసిన్ ఉంగరాలు కొత్త అందాన్నిస్తాయి. రెసిన్లో అక్షరాలు, దేవుని రూపాలే కాదు.. ప్రకృతి అందాలనూ బంధించవచ్చు. ప్రత్యేకమైన జిగురుతో రూపొందించిన ఈ ఉంగరాల్లో.. దంపతులు పార్కు బెంచీపై కూర్చున్నట్టు, పిల్లలు టెన్నిస్ ఆడుతున్నట్టు.. ఇలా ఎన్నో ఆకట్టుకొనే దృశ్యాలు!
వింత కాంతులతో మెరిసిపోయే పెండెంట్లు, చెవిపోగులు తయారు చేయడానికి రెసిన్లో రంగులు కలుపుతారు. అంతేకాదు, ఇష్టమైనవారి ఫొటోలను పెండెంట్లో పెట్టి పైనుంచి రెసిన్ వేస్తే లాకెట్లానూ తయారవుతుంది. ఇంకేముంది, ఆత్మీయుల ప్రతిబింబం నిత్యం మెడలో కదలాడుతూ ఉంటుంది. రెసిన్ నగలు విద్యుద్దీప కాంతుల్లో అయితే, ధగధగమంటూ మెరిసిపోతాయి.
మార్కెట్లో ఎటూ రెసిన్ అందుబాటులో ఉంది కాబట్టి, ఈ నగలను ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. ఆ ప్రయత్నంలో పరిసరాల్లో లభించే పూలు, ఆకులు, చెక్కపొట్టు, ఈకలు.. తిరుగులేని ముడిసరుకు. ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో.. అచ్చుల్లో రెసిన్ పోసి అతినీల లోహిత కిరణాల కింద ఓ పది నిమిషాలు పెడితే చాలు. యూవీ లైట్ అందుబాటులో లేకపోతే, సూర్యరశ్మి అయినా సరిపోతుంది.
ఈ నగల్ని రోజూ వాడుకోవచ్చు. నల్లబడటం, రంగు తగ్గిపోవటం వంటి సమస్యలేవీ ఉండవు. పైగా పెద్ద ఖరీదైనవి కూడా కాదు. కాబట్టి, మరీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన పనిలేదు. దొంగల భయం అసలే లేదు. కాలేజీలకూ, ఆఫీసులకూ వెళ్ళేవారు రోజువారీ దుస్తుల మీదికి నప్పేలా ఎన్ని జతలైనా కొనేయవచ్చు.
రెసిన్ నగలు చూడముచ్చటగా ఉన్నా.. తయారు చేసే టప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరి. ఘనీభవించిన రెసిన్ నగలను ధరించడం వల్ల ఎటువంటి ప్రమాదమూ లేదు. కానీ ద్రవరూపంలోని రెసిన్ చేతులకు అంటుకుంటే మాత్రం ఓపట్టాన ఊడిపోదు. పైగా చర్మానికి హాని చేస్తుంది. అందుకే, తయారు చేసేటప్పుడు చేతులకు రబ్బరు గ్లౌజులు వేసుకోవాలి. రెసిన్ గట్టిపడేందుకువాడే యూవీ కిరణాలు చేతులమీద పడకుండా జాగ్రత్తపడాలి. భోజనం సమయంలో రెసిన్తో చేసిన ఉంగరాలను పక్కనపెట్టడమే మంచిది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Bangles
- beauty tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Alert | మరో తుపాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
Promotions Scam | నర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోషన్లలో వసూళ్ల దందా.. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు?
Bharat Summit | కార్మికుల నెత్తురుతో.. సమ్మిట్ సోకులు.. భారత్ సమ్మిట్‌కు ఖర్చు చేసే సొమ్ములో మేజర్ వాటా కార్మిక సంక్షేమ బోర్డుదే!
Balmoor Venkat | ఎమ్మెల్సీ బల్మూరి బల ప్రయోగం.. 20 మంది ప్రాణాలు కాపాడిన బాండీ బీచ్ హీరోకు సొంత రాష్ట్రంలో కష్టాలు
Rythu Runa Mafi | రుణమాఫీకి కుంటిసాకులు.. అర్హత ఉన్నా రైతుకు అందని వైనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

