హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 30 : కాకతీయ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ జాఫర్ నిజాంహాల్లో ఈనెల 3న (శనివారం) మధ్యాహ్నం 1.30 గంటలకు ‘రోహిత్ వేముల చట్టం’పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని అన్ని విద్యార్థిసంఘాలు, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ బాగస్వామ్యంతో నిర్వహిస్తున్నామని అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్ఏ) స్టేట్ జనరల్ సెక్రటరీ, కాకతీయ యూనివర్సిటీ కన్వీనర్ దండు నవకిరణ్ తెలిపారు. బుధవారం కేయూ మొదటిగేట్ వద్ద రౌండ్ టేబుల్ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం నవకిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్, విద్యార్థులపై రోజు రోజుకూ తీవ్ర వివక్షత కొనసాగుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కే.లక్ష్మీనారాయణ,
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏఎస్ఏ-హెచ్‌సీయూ మాజీ అధ్యక్షుడు డాక్టర్ దొంత ప్రశాంత్, కేయూ ప్రొఫెసర్లు వై.వెంకయ్య, ఈసం నారాయణ, గాదె సమ్మయ్య, పి.వరలక్ష్మీ, ఎల్పీ.రాజ్‌కుమార్, కే.బిక్షాలు, చిర్ర రాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏ.రాజు, పోడేటి శ్రీనివాస్, టీ.రాజమణి, పుల్ల శ్రీనివాస్ పాల్గొంటారని చెప్పారు. డీఎస్ఏ స్టేట్ కన్వినర్ కోమగాని శ్రవణ్, కేయూ టీఎస్ఎఫ్ఐ అధ్యక్షులు పి.వినయ్‌కుమార్, టీబీఎస్ఎఫ్ కేయూ ఇన్చార్జ్ మురళి, ఏఎంఎస్ఏ కేయూ అధ్యక్షులు గుండు రాజేష్, రీసెర్చ్ స్కాలర్లు తిరుపతి, అజయ్, అశోక్, మహేష్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.