అభిమాన్ గాంధీనాయక్ అరెస్ట్ చేసిన పోలీసులు
:కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధేయ మార్గంలో నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, టీఎస్ జీసీసీ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీనాయక్ ధరావత్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
కొడకండ్ల, నవంబర్ 05 :కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధేయ మార్గంలో నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, టీఎస్ జీసీసీ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీనాయక్ ధరావత్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. నవంబర్ 5వ తేదీ ఉదయం గిర్నితండాలోని ఆయన నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో కొడకండ్ల పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని, మొదట కొడకండ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అకడి నుంచి ఆయనను జఫర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ఉదయం 9 గంటలకు పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఆ తర్వాత ‘కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి – కేసీఆర్ ప్రభుత్వం రావాలి’ అనే నినాదంతో నిరసనను ప్రారంభించాల్సి ఉంది.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు, రైతులు, నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగుల పెండింగ్‌ల పరిష్కారం కోసం ఈ నిరసన చేపట్టాలని నిర్ణయించారు. నిరసన ప్రారంభానికి ముందే ఆయనను అదుపులోకి తీసుకోవడంపై పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హకును కాలరాస్తున్నారని విమర్శిస్తూ, అరెస్టుకు గల కారణాలను పోలీసులు వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. అభిమాన్ గాంధీనాయక్ ను ఏ కారణంతో అదుపులోకి తీసుకున్నారో ఆయనపై ఏదైనా కేసు నమోదు చేశారో లేదో అనే విషయాలపై పోలీసుల నుంచి ఇంకా అధికారిక స్పష్టత రాలేదు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangula Kamalakar | కేసీఆర్ బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడితే.. రేవంత్ రెడ్డి చీకటి జీవో జారీ చేసిండు : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
‘మైనార్టీ మహిళలకు ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగ అవకాశాలు’
SI Krishna Reddy | తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టిని సారించాలి : ఎస్సై కృష్ణారెడ్డి
గౌతంపూర్ స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువు
AP Elections | ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ..ఎల్లుండి ఫలితాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

