హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 25 : స్కూల్ గేమ్స్ఫెడరేషనష్ అఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఎస్ఐ) పాఠశాలస్థాయి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్-17 బాలబాలికల కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం హనుమకొండ జేఎన్‌ఎస్‌లోని ఇండోర్ కబడ్డీహాల్లో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం జరిగిందని ఎస్ఎఫ్ఐ అండర్-14, 17 హనుమకొండ జిల్లా కార్యదర్శి వరికోటి వాసుదేవరావు తెలిపారు. హనుమకొండ జిల్లావ్యాప్తంగా ఉన్న 14మండలాల నుంచి 350 మంది బాలబాలికల, 100 మంది కోచ్‌లు, టెక్నికల్ అఫీషియల్స్, పాల్గొన్నారని తెలిపారు.
ఇక్కడ జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన బాలబాలికల త్వరలో హనుమకొండ వేదికగా నిర్వహించే ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని వాసుదేవరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీజీపేట రాష్ర్ట అసోసియేట్ అధ్యక్షుడు బోగి సుధాకర్, జిల్లా అధ్యక్షుడు శీలం పార్థసారధి, ఎస్ఏపీఈటీఏ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎ.ప్రభాకర్‌రెడ్డి, ఎసీఎఫ్ఎస్ఐ హనుమకొండ మండల కార్యదర్శి శ్రీధర్‌రావు, ఎస్ఏ పీఈటీలు వెంకటేశ్వర్లు, సురేష్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.