ప్రేమతో జయిద్దాం..
మా పిల్లలు మార్కులు బాగా తెచ్చుకోవాలి. ఉద్యోగాలు సంపాదించాలి. ఇలాంటి వాటిపైన తల్లిదండ్రులుగా శ్రద్ధ చూపి వారిని ఆ దిశగా ప్రోత్సాహం అందించాలి. కానీ మేము మా అబ్బాయిని సెల్‌ఫోన్ నుంచి దూరం చేయడానికే సమయం కేటాయించాల్సి వస్తున్నది.
- యువతలో వ్యసనంలా మారుతున్న మొబైల్స్ వినియోగం
- పేరెంట్స్ కంటే స్మార్ట్ఫోన్లకే అధిక ప్రాధాన్యం
- స్మార్ట్ఫోన్ల అతి వాడకం.. ప్రవర్తనలో విపరీత మార్పులు
- వద్దంటే ఆత్మహత్యలకు వెరవని వైనం
- కౌన్సెలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్న బాధితులు
మా అమ్మాయి పూర్ణిమ(19) ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తున్నది. సెల్‌ఫోన్ వాడుతున్నప్పటి నుంచి మా మాట వినడం తగ్గించింది. మొండిగా సమాధానమిస్తున్నది. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావంటే చెప్పదు. గంటల కొద్దీ ఫోన్లోనే గడిపేస్తున్నది. ఇంతకుముందు మేము ఊరెళ్తే ఇంట్లో ఒక్కతే ఉండాల్సి వస్తుందని మాతోనే వచ్చేది. ఇప్పుడు మేము ఎప్పుడు ఊరెళ్తామా అని ఎదురుచూస్తున్నట్టుగా ఆమె మాటలు ఉంటున్నాయి. మా అమ్మాయికి ఎవరైనా ప్రేమికుడు ఉన్నారా? లేక ఆ వయసులో ఇలాంటి ప్రవర్తన సహజమేనా? రాత్రిళ్లు కూడా సెల్‌ఫోన్‌తోనే ఉంటుంది. అసలు మా అమ్మాయి మొబైల్ నుంచి దూరం కావాలంటే ఏం చేయాలి?” అని ఓ తల్లి సైకియాట్రిస్టుకు వివరించింది.
మా పిల్లలు మార్కులు బాగా తెచ్చుకోవాలి. ఉద్యోగాలు సంపాదించాలి. ఇలాంటి వాటిపైన తల్లిదండ్రులుగా శ్రద్ధ చూపి వారిని ఆ దిశగా ప్రోత్సాహం అందించాలి. కానీ మేము మా అబ్బాయిని సెల్‌ఫోన్ నుంచి దూరం చేయడానికే సమయం కేటాయించాల్సి వస్తున్నది. ఇక వాడిని చదువుకో అని చెప్పే ధైర్యం కూడా చేయలేకపోతున్నాం. కారణం వాడు మాపైనే చేతులెత్తుతున్నాడు. ఇంట్లో ఉన్న వస్తువులను విసిరేస్తున్నాడు. రాత్రి 2, 3 అయినా మేల్కొనే ఏవేవో వీడియోలు చూస్తుంటాడు. ఓ రోజు వాడి ఫోన్ చెక్ చేస్తే అందులో అసభ్యకరమైన వీడియోలు ఉన్నాయి. వాడిని ఎలా మంచి ప్రవర్తనలోకి తీసుకురావాలి?” అంటూ ఓ తండ్రి సైకియాట్రిస్ట్‌ను ఆశ్రయించాడు.

సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ ) : స్మార్ట్‌ఫోన్ ఇప్పుడొక వ్యసనంలా మారిపోయింది. అతిగా వాడడం వల్ల పిల్లలు, ముఖ్యంగా యువత ప్రవర్తన విపరీత మార్పులకు లోనవుతోంది. అసలు మాటే వినడం లేదని తల్లిదండ్రులు వాపోవడం, పిల్లలు నిదురపోతున్న సమయంలో వారి ఫోన్లను కన్నవారు తనిఖీ చేస్తున్న సంఘటనలూ జరుగుతున్నాయి.
చుట్టూ జరిగే సంఘటనలను తమ బిడ్డలకు ఆపాదించుకొని మనోవేదనకు గురవుతున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఫోన్ల నుంచి వచ్చే నీలికాంతులు ఒకవైపు.. అసభ్యకర వీడియోలు మరోవైపు వారి ఆలోచనలను మానసికంగా, శారీరకంగా భ్రష్టు పట్టిస్తూ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. ఫలితంగా ఉన్నత లక్ష్యాలు మధ్యలోనే ఆవిరవుతున్నాయి. గతంలో మార్కులు, ర్యాంకులు సాధించలేమని ఒత్తిడికి గురయ్యే యువత ఇప్పుడు క్షణకాలం ఫోన్లు ఆగినా, పెద్దలు ఆపేసినా గందరగోళానికి గురవుతున్నారు. మరికొందరు ఆత్మహత్యకూ వెనకాడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటేనే మార్పు తీసుకురాగలమని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాల్సిందే..

- ప్రస్తుత విద్యావిధానంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఇంట్లో స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా మారింది. దీంతో వారికి బ్రౌజింగ్ వ్యసనంగా మారింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకపోతే అది పిల్లల భవితకు శాపంగా మారే ప్రమాదముంది. పిల్లలతో కఠినంగా వ్యవహరించకుండా ఫ్రెండ్లీగా చెబితే వారిలో మార్పు ఉంటుంది.
- మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు, ఒంటరితనం, జీవితంపై నిరాశ ఇవన్నీ అలవాడేందుకు ఫోన్‌ను ఎక్కువగా వాడడమే కారణమంటున్నారు నిపుణులు. ఈ ధోరణిని అదుపు చేయకపోతే వ్యక్తిగత ఆరోగ్యం, సామాజిక భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి.
- సెల్‌ఫోన్ అదే పనిగా నియంత్రణ లేకుండా వినియోగించడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. అవసరమైన విషయాలపై నిరాసక్తత ఉంటుంది. అతిగా ఆలోచించడం పెరుగుతుంది. మరోవైపు ఆరోగ్యపరంగాను క్యాన్సర్ వంటి వ్యాధులు పొంచి ఉన్నాయి.
- పేరెంట్స్ కూడా ఎక్కువగా మొబైల్ వినియోగించకుండా పిల్లలతో వీలైనంత సమయం గడపాలని నిపుణులు చెబుతున్నారు.
- ప్రస్తుత ప్రపంచంలో నూటికి 90 శాతం మందికి ఏదో ఒక వ్యసనం కచ్చితంగా ఉంటుంది. అలా మన దేశంలో ప్రస్తుతం అశ్లీలత ఒకరకమైన మాదక ద్రవ్యం వంటి వ్యసనంగా మారిపోయింది. అశ్లీల వీడియోలు చూస్తున్న జాబితాలో చాలామంది యువత అధికంగా ఉంటున్నారు. 17-24 ఏండ్ల మధ్య ఉన్న వారు 44 శాతం మంది, 25-34 మధ్య ఉన్న వారు 41 శాతం మంది అశ్లీల వీడియోలు చూస్తున్నట్టు ఓ సర్వే రిపోర్టు వెల్లడించింది. పిల్లలకు సృజనాత్మకత పెంపొందించేలా వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సాహం అందించాలి.
ఎలా బయటపడాలి ?

ఎవరైనా అశ్లీల వీడియోలకు అడిక్ట్ అయి ఉంటే వారు మొదట ఆ విషయాన్ని తమకు తాము ఒప్పుకోవాలి. తమలో వచ్చిన మార్పులను గ్రహించాలి. రోజులో ఎంత సమయం ఎలాంటి యాక్టివిటీస్‌కు కేటాయిస్తున్నామో పేపర్‌పై రాసుకోవాలి. చేయాల్సిన పనిని రద్దు చేసుకొని మరీ ఫోన్లోనే గడిపేస్తున్నామా? అనేది ఆలోచించాలి. ఇలాంటి ప్రవర్తనతో వచ్చే ప్రతికూల పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. స్వీయనియంత్రణ చాలా ముఖ్యం. ఈ సమయంలో అడిక్షన్ నుంచి బయటపడే మార్గాలు వెతుక్కోవాలి. చాలావరకు ఒత్తిడి, ఖాళీ సమయం ఎక్కువగా ఉన్నవాళ్లు వీటి బారిన పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మొబైల్ డేటా తగ్గించుకోవడం, అశ్లీల యాక్టివిటీ సదుపాయాలను రద్దు చేసుకోవడం చేయాలి. ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. తీరిక దొరికినప్పుడు సంగీతం, డ్యాన్స్, ఇతరాత్రా వాటిపై దృష్టి కేంద్రీకరించాలి. అయినా కుదరకపోతే సైకాలజిస్టును సంప్రదిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
సున్నితంగా వ్యవహరించాలి
యువత పెడదారి పట్టకుండా పేరెంట్స్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. టీనేజ్‌లో అడుగుపెట్టిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ వయసులో పిల్లలు స్వతంత్రులుగా వ్యవహరిస్తుంటారు. ప్రత్యేక గుర్తింపు కోసం వెంపర్లాడుతుంటారు. ఈ తరుణంలో వారు సెల్ఫోన్లను అధికంగా వినియోగిస్తారు. అందులో ఉండే అశ్లీలతకు తొందరగా అట్రాక్ట్ అవుతుంటారు. టీనేజ్‌లో పిల్లలకు తల్లిదండ్రులు అండగా నిలవాలి. వారి సమస్యలను ఓపికగా విని అర్థం చేసుకోవాలి. మాట నినడం లేదని కఠినంగా వ్యవహరించకూడదు.
– నందిత, సైకాలజిస్ట్ట్
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

