ప్రీ ఈవెంట్ మార్మోగిన నిట్
వరంగల్ నిట్‌లో స్ప్రింగ్‌స్ప్రీ ప్రీ ఈవెంట్ ఉత్సాహంగా సాగింది. వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో జరిగే స్ప్రింగ్ స్ప్రీ సందర్భంగా సోమవారం ముందస్తు వేడుక నిర్వహించారు. సినీహీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ అతుల్య రవి విచ్చేసి సందడి చేయగా విద్యార్థుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది.
- ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ ముందస్తు వేడుక
- సందడి చేసిన సినీహీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ అతుల్య రవి
- విద్యార్థుల కేరింతలతో మార్మోగిన ప్రాంగణం
నయీంనగర్, మార్చి 27 : వరంగల్ నిట్‌లో స్ప్రింగ్‌స్ప్రీ ప్రీ ఈవెంట్ ఉత్సాహంగా సాగింది. వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో జరిగే స్ప్రింగ్ స్ప్రీ సందర్భంగా సోమవారం ముందస్తు వేడుక నిర్వహించారు. సినీహీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ అతుల్య రవి విచ్చేసి సందడి చేయగా విద్యార్థుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సందర్భంగా కేరింతలతో అంబేద్కర్ లర్నింగ్ సెంటర్ మార్మోగింది. అంతకుముందు వచ్చే నెల 7న విడుదల కానున్న మీటర్ మూవీ ట్రైలర్‌ను హాల్లో ప్లేచేయడంతో విద్యార్థులు తిలకించారు. ఆ తర్వాత స్టేజీపై తారలతో బీటెక్ విద్యార్థి మేరి చిట్‌చాట్ సరదాగా సాగింది. స్ప్రింగ్‌స్ప్రీ వేడుకల వివరాలను బుధవారం వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్‌తో పాటు పులి రవికుమార్, సాయిచరణ్ మల్యాల, వంశీ, రాహుల్, రుబెన్ రాజ్, వైభవన్ పాటు పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
కష్టమైనా తెలంగాణ యాస నేర్చుకున్నా..
వరంగల్ అంటే ఎంతో ఇష్టమని.. కష్టమైనా తెలంగాణ యాస నేర్చుకున్నానని సినీహీరో కిరణ్ అబ్బవరం చెప్పారు. స్ప్రింగ్‌స్ప్రీ ప్రీ ఈవెంట్‌కు వచ్చిన ఆయన ‘నమస్తే తెలంగాణ’తో కాసేపు ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ‘వరంగల్ అంటే నాకు ఎంతో ఇష్టం. తెలంగాణ యాస అంటే అమితమైన ఇష్టం. ఎప్పటికైనా తెలంగాణ యాస, భాషలో మంచి సినిమా తీయాలని ఉంది. అందుకే కష్టమైనా నేర్చుకున్నా. మంచి కథ దొరికితే తప్పకుండా సినిమా తీస్తా. నేను తీసిన ఆరు సినిమాలకు వరంగల్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే నెల 7న రిలీజ్ కాబోతున్న మీటర్ మూవీని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నా. మాది కడపలోని రాయచోటి. నాన్న రైతు, అమ్మ ఇంట్లోనే ఉండేది. అన్న కొన్ని రోజుల క్రితమే మాకు దూరమయ్యాడు. మూడేళ్ల పాటు ఉద్యోగం చేశాను. జాబ్ చేసే సమయంలో ఇది జీవితం కాదనించింది. ముఖ్యంగా సినిమాలు అంటే పిచ్చి బాగుండేది. మొదట షార్ట్ఫిలిమ్స్ ఏడు తీశాను. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. నిట్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పారు. చివరగా ఏ హీరోయిన్ అంటే అనే ప్రశ్నకు నవ్వుతూ అలాంటిదేమీ లేదని బదులిచ్చాడు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

