ఐస్‌క్రీమ్‌లో వీర్యం.. మూత్రం
ఐస్‌క్రీమ్‌ను తలుచుకుంటేనే వాంతిచేసుకునేంత పనిచేశాడో ప్రబుద్ధుడు.. ఏం పైత్యమోగానీ.. ప్రజలకు అమ్మే ఐస్‌క్రీమ్‌లో తన వీర్యాన్ని, మూత్రాన్ని కలిపాడు.. ఈ దారుణాన్ని చాటుగా సెల్ఫోన్లో చిత్రీకరించిన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సదరు ప్రబుద్ధున్ని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
- నెక్కొండలో విక్రేత రోత పని
- వీడియో వైరల్.. నిందితుడి అరెస్ట్
- శాంపిల్స్ సేకరించిన ఫుడ్ ఇన్స్పెక్టర్
నెక్కొండ, మార్చి 19 : ఐస్‌క్రీమ్‌ను తలుచుకుంటేనే వాంతిచేసుకునేంత పనిచేశాడో ప్రబుద్ధుడు.. ఏం పైత్యమోగానీ.. ప్రజలకు అమ్మే ఐస్‌క్రీమ్‌లో తన వీర్యాన్ని, మూత్రాన్ని కలిపాడు.. ఈ దారుణాన్ని చాటుగా సెల్ఫోన్లో చిత్రీకరించిన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సదరు ప్రబుద్ధున్ని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా నెక్కొండలో రాజస్థాన్‌కు చెందిన కాలురాం పుర్బియా అనే వ్యక్తి ఐస్‌క్రీమ్ బండి పెట్టుకున్నాడు. అంబేద్కర్ కూడలిలో రోజూ ఐస్‌క్రీమ్‌లు విక్రయిస్తుంటాడు. బహిరంగంగానే తన వీర్యాన్ని, మూత్రాన్ని ఐస్‌క్రీమ్‌లో కలుపుతుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఇది సోమవారం రాత్రి వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్సై మహేందర్ విచారణ చేపట్టి బహిరంగ ప్రదేశంలో హేయమైన చర్యకు పాల్పడ్డ కాలురాం పుర్బియాను మంగళవారం అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వరంగల్ జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ చేపూరి కృష్ణమూర్తి ఐస్‌క్రీమ్ బండికి సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. పంచాయతీ కార్యదర్శి సదానందంతో కలిసి ఐస్‌క్రీమ్ బండిలోని ఐటమ్స్‌ను బయట పారబోయించారు. ఈ సందర్భంగా సీఐ చంద్రమోహన్ మాట్లాడుతూ బండ్లపై ఐస్‌క్రీమ్‌లు, తినుబండారాలు విక్రయించేవారు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నవారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బయట పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిదని తెలిపారు. నెక్కొండలో ఐస్‌క్రీమ్‌లు అమ్మేవారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి హెచ్చరికలు జారీచేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

