సాగు చేసే వారికే భరోసా ఇవ్వాలి
‘సాగు చేసే ప్రతి రైతుకూ రైతు భరోసా ఇవ్వాలి.. పండించిన ధాన్యానికి బోనస్ ఇవ్వాలి.. కౌలు రైతులకు కూడా పథకం వర్తింపజేయాలి.. పండ్లు, కూరగాయ తోటలను ప్రోత్సహించాలి.. ఎరువులు, కూరగాయల విత్తనాలపై సబ్సిడీపై అందించాలి.. యువ రైతులను ప్రోత్సహించాలి.. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి..
- యువ రైతులను ప్రోత్సహించాలి
- ధాన్యానికి బోనస్ చెల్లించాలి
- ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ ఇవ్వాలి
- వ్యవసాయ పరికరాలు పంపిణీ చేయాలి
- బాయిలకాడికి సీసీ రోడ్లు వేయాలి
- పలువురు రైతుల అభిప్రాయం
హనుమకొండ, జూలై 15 : ‘సాగు చేసే ప్రతి రైతుకూ రైతు భరోసా ఇవ్వాలి.. పండించిన ధాన్యానికి బోనస్ ఇవ్వాలి.. కౌలు రైతులకు కూడా పథకం వర్తింపజేయాలి.. పండ్లు, కూరగాయ తోటలను ప్రోత్సహించాలి.. ఎరువులు, కూరగాయల విత్తనాలపై సబ్సిడీపై అందించాలి.. యువ రైతులను ప్రోత్సహించాలి.. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి.. కష్టపడుతున్న రైతుకు చిన్న పెట్టుబడి కోసం ఇచ్చేదే రైతు భరోసా.. రైతులకు పింఛన్లు ఇవ్వాలి.. బాయిలకాడికి వెళ్లేందుకు సీసీ రోడ్లు వేయాలి’ అని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో రైతు భరోసా పథకం అమలుపై ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు, రైతు సంఘం నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎకరం నుంచి 10 ఎకరాలు ఉన్న వారికి ఇవ్వాలని ఎక్కువ మంది, అందరికీ ఇవ్వాలని కొందరు, కౌలు రైతులకు కూడా పథకం అమలు చేయాలని మరికొందరు కోరారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. కొంత మంది రైతులు తమకు కూడా మాట్లాడే అవకాశం కల్పించాలని, ఎం పిక చేసిన వారినే సమావేశానికి పిలిస్తే బాగుండేదని అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సూచించారు.
రైతులను రైతులుగానే చూడాలి
రైతులను రైతులుగా మాత్రమే చూడాలి. మా తాతలు, తండ్రులు వ్యవసాయం చేసేవారు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో నేను డాక్టర్‌ను అయినప్పటికీ వ్యవసాయం చేస్తున్నాను. సాగు చేసే ప్రతి రైతుకూ తేడాలు లేకుండా రైతు భరోసా అమలు చేయాలి. పండ్లతోటలను ప్రోత్సహించాలి. కొత్త పంటలకు భరోసా ఇవ్వాలి. సబ్సిడీ విధానం సైతం అమలు చేయాలి.
-డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి, నెఫ్రాలజిస్టు, హనుమకొండ
10 ఎకరాల వరకు భరోసా ఇవ్వాలి
ఎకరం నుంచి మొదలుకొని 10 ఎకరాలున్న రైతులందరికీ రైతు భరోసా పథకం వర్తింపజేయాలి. అలాగే కౌలు రైతులను గుర్తించేందుకు గ్రామ స్థాయిలో రైతులు సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేయాలి. సబ్సిడీపై వ్యవసాయ పరికరా లు అందజేయాలి.
-చిర్ర కుమారస్వామి, దీక్షకుంట, నెక్కొండ మండలం
రికార్డులు వేర్వేరుగా ఉంటున్నాయి
రెవెన్యూ, వ్యవసాయ శాఖల వద్ద ఉన్న వివరాల్లో వ్య త్యాసం ఉంటున్నది. ఇరు శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ముందుగా రికార్డులు సరిచేయాలి. ఐదు నుంచి 10 ఎకరాల వరకు సాగు చేస్తున్న ప్రతి రైతుకూ రైతు భరోసా అమలు చేయాలి. ఐటీ కట్టే చిరు ఉద్యోగులకు సైతం పథకం వర్తింపజేస్తే బాగుంటుంది.
– మాదిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ
యువ రైతులను ప్రోత్సహించాలి
వ్యవసాయం బతికి ఉండాలంటే యువ రైతులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఐదెకరాల నుంచి 10 ఎకరాల వరకు రైతులకు పథకం అమలు చేయవచ్చు. టాక్స్ పేయర్స్‌కు సైతం రైతు భరోసా అమలు చేయాలి. అలాగే రైతులకు ఎరువులు, విత్తనాలతో పాటు వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీపై అందించాలి.
– సందీప్‌కుమార్, బచ్చన్నపేట, జనగామ
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

