కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్వో పీ ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఈ నెల 4న ఎనుమాముల మార్కెట్ యార్డులో కౌంటింగ్ ఉంటుందని పేర్కొన్నారు.
- నియోజకవర్గాల వారీగా టేబుళ్లు
- మూడంచెల భద్రతకు ఏర్పాట్లు
- ఆర్వో ప్రావీణ్య
ఖిలావరంగల్, జూన్ 2 : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్వో పీ ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఈ నెల 4న ఎనుమాముల మార్కెట్ యార్డులో కౌంటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని 295 పోలింగ్ కేంద్రాలకు 17 టేబుళ్లు, 18 రౌండ్లు, పాలకుర్తి-296 పోలింగ్ కేంద్రాలకు 17 టేబుళ్లు, 18 రౌండ్లు, పరకాల 239 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్ల్లు, 18 రౌండ్లు, వరంగల్ పశ్చిమ 244 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు, 18 రౌండ్లు, వరంగల్ తూర్పు 230 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు, 17 రౌండ్లు, వర్ధన్నపేట 279 పోలింగ్ కేంద్రాలకు 16 టేబుళ్లు, 18 రౌండ్లు, భూపాలపల్లి 317 పోలింగ్ కేంద్రాలకు 18 టేబుళ్లు, 18 రౌండ్ల ద్వారా కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈవీఎం కౌంటింగ్‌కు సంబంధించి ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ కలిసి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రౌండ్ ప్రకారం రిజల్ట్‌ను నమోదు చేస్తారని ఆర్వో తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి ప్రత్యేక హాల్‌ను ఏర్పాటు చేశామని, హోమ్ ఓటింగ్, విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించిన ఓట్లను 14 టేబుళ్ల ద్వారా లెక్కిస్తామని పేర్కొన్నారు. ఒక టేబుల్‌కు ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, తహసీల్దార్ స్థాయి ఏఆర్వో ఉంటారని తెలిపారు. దీనితోపాటు సర్వీసు ఓటర్లకు సంబంధించి ఈటీపీబీఎస్ పద్ధతిలో సానింగ్ ద్వారా కౌంటింగ్ నమోదు చేస్తారని వెల్లడించారు. కౌంటింగ్ సిబ్బందికి రెండుసార్లు శిక్షణ ఇచ్చామన్నారు. ఎన్నికల సంఘం నియమించిన ఇద్దరు అబ్జర్వర్లు బండారి స్వాగత్ రణవీర్‌చంద్, రాజేశ్‌కుమార్ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తారని పేర్కొన్నారు. పోస్టల్, ఈవీఎం బ్యాలెట్ల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తామని ఆర్వో పేర్కొన్నారు. కౌంటింగ్ కోసం మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాగా, జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల కౌంటింగ్ విధుల్లో నిమగ్నమైనందున నేటి ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టరేట్ తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

