అధ్వానంగా హనుమకొండ బస్ స్టేషన్
నిత్యం వేలాది మందితో కిటకిటలాడే హనుమకొండ బస్‌స్టేషన్‌లో బస్సులు దిగబడుతున్నాయి. చిన్న వానకే బస్టాండ్ ప్రాంగణమంతా గుంతలుపడి అధ్వానంగా తయారైంది. నీటితో నిండిపోవడంతో బస్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. మురుగుకాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో బస్టాండ్‌లోని వర్షపు నీరు బయటకు పోకపోవడంతో ఆవరణంతా నిండిపోతున్నది.
- చిన్న వానకే జలమయమవుతున్న ప్రాంగణం
- గుంతలు ఏర్పడి దిగబడుతున్న బస్సులు
- నడిచేందుకు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
హనుమకొండ చౌరస్తా, జూలై 21 : నిత్యం వేలాది మందితో కిటకిటలాడే హనుమకొండ బస్‌స్టేషన్‌లో బస్సులు దిగబడుతున్నాయి. చిన్న వానకే బస్టాండ్ ప్రాంగణమంతా గుంతలుపడి అధ్వానంగా తయారైంది. నీటితో నిండిపోవడంతో బస్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. మురుగుకాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో బస్టాండ్‌లోని వర్షపు నీరు బయటకు పోకపోవడంతో ఆవరణంతా నిండిపోతున్నది.
కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాల్సిన అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. ఆర్టీసీ అధికారులు ఏటా మరమ్మతుల పేరిట రూ. లక్షల్లో ఖర్చుచేసి తూతూమంత్రంగా పనులు చేయిస్తుండడంతో సమస్యలు పునరావృతమవుతున్నా యి. అసలే ఇరుకుగా మారిన హనుమకొండ బస్‌స్టేషన్ రోడ్లో డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోవడంతో రోడ్లన్నీ జలమయంగా మారి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంటున్నది. ఇప్పటికైనా అధికారు లు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

