MLA Kadiyam | ఎమ్మెల్యే కడియం సవాల్‌ను స్వీకరించిన రాజయ్య.. టైము, డేటు చెప్పాలని ప్రతి సవాల్
భూకబ్జా వార్తలపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విసిరిన సవాల్‌కు మాజీ ఎమ్మెల్యే రాజయ్య సై అన్నారు.
స్టేషన్ ఘనపూర్ 09 : ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే టి. రాజయ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలో కడియం భూకబ్జా వార్తలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి విసిరిన సవాల్‌కు మాజీ ఎమ్మెల్యే రాజయ్య సై అన్నారు. బుధవారం స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూరు గ్రామాలలో కడియం శ్రీహరి భూకబ్జా చేశాడంటూ వచ్చిన వార్తలపై కడియం శ్రీహరి స్పందించారు.
తనపై ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్యల వద్ద గులాంగిరీ చేస్తానని, లేనియెడల వారు తన వద్ద చేయాలంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు స్పందించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య కడియం సవాలును స్వీకరిస్తున్నానని, టైం, డేటు, లొకేషన్ కడియమే నిర్ణయించాలన్నారు. ఫారెస్ట్ భూములలో ఉపాధి హామీలో పెట్టిన కోట్ల విలువైన చెట్లను తొలగించడమే కాకుండా మైనింగ్ అనుమతి లేకుండా మొరం తరలించాలని రాజయ్య ఆరోపించారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాల్ ప్రతి సవాల్‌తో నియోజకవర్గంలోని రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prasidh Krishna: కివీస్‌తో వన్డేలకు ప్రసిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జట్టులోకి సిరాజ్
Mirzapur: The Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ షురూ!
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

