లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం
లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని డీఎంహెచ్‌వో డాక్టర్ కాజీపేట వెంకటరమణ అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ,
- ఆడపిల్లలను పురిటిలోనే చంపొద్దు
- భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు
- సమీక్షలో డీఎంహెచ్‌వో వెంకటరమణ
గిర్మాజీపేట, జనవరి 31: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని డీఎంహెచ్‌వో డాక్టర్ కాజీపేట వెంకటరమణ అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ, దవాఖానల రిజిస్ట్రేషన్, స్కానింగ్ కేంద్రాలపై సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిష్పత్తి సమానంగా ఉండాలని, ఇందుకు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు, ప్రజలు మానవతా దృక్పథంతో ఆలోచించి ఆడపిల్లలు పుట్టనివ్వాలలి.. ఎదగనివ్వాలని కోరారు. భ్రూణ హత్యలకు పాల్పడినా, పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గర్భిణులకు స్కానింగ్ చేసిన వెంటనే వారి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అభ్యదయ సేవా సమితి అధ్యక్షుడు మండల పరశురాములు మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లను ఎక్కువగా మానిటరింగ్ చేయడానికి, ప్రజలకు గర్భస్థ లింగనిర్ధారణ పరీక్షలు చేయకుండా అవగాహన కల్పించడానికి, లింగ నిష్పత్తి పెంచడానికి ఎన్జీవోల సహాయం తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ గోపాల్‌రావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి స్కానింగ్ సెంటర్‌ను మానిటరింగ్ చేస్తున్నామని, ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, దవాఖాన రిజిస్ట్రేషన్ విషయంలో నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. సమావేశంలో సీకేఎం దవాఖాన గైనకాలజిస్ట్ బీ కవిత, డాక్టర్ ప్రకాశ్, లీగల్ అడ్వైజర్ రేవతిదేవి, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, రాజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

